By: ABP Desam | Updated at : 08 Jun 2023 01:32 PM (IST)
Edited By: omeprakash
ఏపీడీఈఈసెట్ 2023 ప్రవేశ పరీక్ష
డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి 'డీఈఈసెట్-2023' పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నట్లు కన్వీనర్ మేరీ చంద్రిక తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
డీఈఈసెట్ పరీక్ష ఫలితాలు, ర్యాంకులను జూన్ 19న విడుదల చేయనున్నారు. ఫలితాల తర్వాత మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్ ఐచ్ఛికాలను జూన్ 22 నుంచి 27 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్ లెటర్లను జూన్ 28 నుంచి 30 వరకు జారీ చేస్తారు. జూన్ 31 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో పార్ట్-ఎ 60 మార్కులు-60 ప్రశ్నలు, పార్ట్-బి 40 మార్కులు-40 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.
డీఈఈసెట్-2023 ప్రవేశ పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!
ఏపీలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏపీ ఎడ్‌సెట్-2023 పరీక్షను జూన్ 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 14న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP EDCET - 2023 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి 'ఏపీ ఎడ్‌సెట్-2023' పరీక్షను మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20న జరపాల్సిన ఉండగా.. జూన్ 14న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది తిరుపతి-శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్ పరీక్ష బాధ్యతను చేపట్టింది.
జూన్ 19న ఆన్సర్ కీ..
ఏపీఎడ్‌సెట్ 2023 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని జూన్ 19న విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జూన్ 21న సాయంత్రం 5 గంటల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా నమోదుచేసిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలు స్వీకరించరు. అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్‌లో మాత్రమే నమోదుచేయాలి. మరే ఇతర విధానాల్లో నమోదచేసే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోరు.
పరీక్ష విధానం..
➥ మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
➥ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు, పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు, టెక్నికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-సిలో మెథడాలజీ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. మెథడాలజీలో అభ్యర్థులు ఎంపికచేసుకునే సబ్జె్క్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.
➥ మెథడాలజీలోలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ (జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్), ఇంగ్లిష్ సబ్జె్క్టులు ఉంటాయి.
CBSE Exams: సీబీఎస్ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష
Cyber Security Course: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు
Fake Universities: దేశంలో నకిలీ యూనివర్సిటీల జాబితా వెల్లడి, ఏపీలో రెండు 'ఫేక్' వర్సిటీలు
AP EDCET: బీఎడ్ కౌన్సెలింగ్, జాబితా నుంచి 18 కళాశాలలు తొలగింపు
APBIE: ఇంటర్ విద్యార్థులకు 'స్టడీ అవర్స్', వారికి 'హాజరు' ఫీజు గడువు నవంబరు 30 వరకు
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
/body>