AP 10TH RESULTS 2023: పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ - మంచి రిజల్ట్స్ వచ్చేలా ప్రత్యేక చర్యలు
తొలిసారిగా ఈ ఏడాది నుంచి ప్రశ్నపత్రాలకు సీరియల్ నంబర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక వేళ లీక్ అయినా అది ఎవరి పేపరో... ఎక్కడి నుంచి లీక్ అయింతో స్పష్టంగా తెలిసిపోయేలా జాగ్రత్త పడ్డారు.
మరికాసేపట్లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో చాలా ఉత్కంఠ నెలకొంది. ఈసారి పరీక్షలు చాలా భిన్నంగా సాగాయి. గతంలో లీకేజీ ఆరోపణలో ప్రభుత్వం అప్రమత్తమై ఈసారి పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది. పేపర్ బయటకు లీక్ అయితే అది ఏ సెంటర్‌లో లీక్ అయిందో తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసింది. అందుకే ఎక్కడా లీకేజీ అనే మాట వినిపించలేదు.
తొలిసారిగా ఈ ఏడాది నుంచి ప్రశ్నపత్రాలకు సీరియల్ నంబర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక వేళ లీక్ అయినా అది ఎవరి పేపరో... ఎక్కడి నుంచి లీక్ అయింతో స్పష్టంగా తెలిసిపోయేలా జాగ్రత్త పడ్డారు. ఈ ఏడాది భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు ఒకే పేపర్‌గా నిర్వహించారు. విద్యార్థులు సమాధానాలు రాసేందుకు కొత్తగా 24 పేజీల బుక్ లెట్ ఇచ్చారు. ఆ బుక్‌లెట్ పూర్తైన వెంటనే కావాలనుకుంటే మరో అదనపు బుక్ లెట్ కూడా ఇచ్చారు.
ఈ సారి మెరుగైన ఫలితాలు రావాలన్న ఉద్దేశంతో విద్యాసంవత్సరం సగం పూర్తవ్వగానే పది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతేడాది జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని మంచి రిజల్ట్ వచ్చేలా ప్లాన్ చేశారు. గతేడాది చాలా మంది పరీక్ష తప్పారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది.
ఈసారి అలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా వాల్యుయేషన్ చేపట్టినట్టు అధికారులు చెప్పారు. అసలు విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు వివరించారు. విద్యాశాఖాధికారులు, ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు. పదో తరగతి విద్యార్థులను మూడు కేటగిరిలుగా విభజించారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. డీసీబీ ద్వారా రివిజన్ టెస్ట్‌లు చేపట్టారు. ఎస్‌ఈఆర్‌టీ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు, స్లిప్ టెస్ట్‌లు ఇలా ఓ ప్రైవేట్ స్కూల్‌లో తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఈ సారి తీసుకున్నారు.
అందుకే ఈసారి మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన పదో తరగతి ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 11 గంటలకు రిజల్ట్స్‌ను రిలీజ్ చేస్తారు. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inలో ఫలితాలను చూడొచ్చు. గత కొన్ని రోజులుగా పదో తరగతి ఫలితాలపై రకరకాల ఊహాగానాలు నడిచాయి. ఇది ఇవాళే పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. కానీ ప్రభుత్వాధికారులు వాటికి వివరణ ఇస్తూ వస్తున్నారు. చివరకు తీవ్ర తర్జనభర్జనల మధ్య ఫలితాలను శనివారం ఉదయం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
పదో తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన bse.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
అక్కడ హోమ్ పేజ్‌లో ఏపీ 10Th రిజల్ట్స్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
వెంటనే వేరే పాపప్ ఓపెన్ అవుతుంది.
అందులో మీ పదోతరగతి హాల్ టికెట్ నెంబర్‌్ టైప్ చేయాలి.
తర్వాత కింద ఉన్న సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేస్తే రిజల్ట్ ప్రత్యక్షమవుతుంది.
ఆ రిజల్ట్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు.