News
News
X

AP 10th Model Paper 2023: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి క్వశ్చన్ పేపర్‌ మోడల్‌-1

పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు ఉపయోగపడేలా ఏబీపీ దేశం మీకు మోడల్‌ పేపర్లు అందిస్తోంది.

FOLLOW US: 
Share:

AP SSC Model Paper -2022-23

Social Studies -100 Marks 

విద్యార్థులకు సూచనలు
1. ప్రశ్నాపత్రం చదవడానికి 15 నిమిషాలు. జవాలు రాయడానికి 3 గంటలు. 
2. అన్ని ప్రశ్నలకు సమాధానా పత్రంలోనే రాయాలి
3. ప్రశ్నాపత్రంలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. 
4. అన్ని ప్రశ్నలకు సమధానాలు స్పష్టంగా రాయాలి
5. సెక్షన్‌-4లో మాత్రమే అంతర్గత ఎంపిక ఉంటుంది. 
 

సెక్షన్-1  12X1=12

ఈ కింది అన్ని ప్రశ్నలకు జవాబు రాయండి

1. భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం?

2.  a. లక్ష దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. 
     b. ఇవి ప్రవాళ బిత్తికల నుంచి ఏర్పడ్డాయి.
     C. ఈ దీవులు వృక్ష, జీవ జాతుల ద్వీప సమూహంగా ఖ్యాంతి గడించాయి.
పైన ఇచ్చిన ప్రకటనల్లో సరైనది గుర్తించండి?
A. ఏ మాత్రమే 
B. బి మాత్రమే 
C. ఏ, బీ రెండు మాత్రమే
D. బీ,సీ, మాత్రమే కరెక్ట్‌

3. ఈ కింది వానిలో మానవాభివృద్ధిని కొలవడానికి కొలవడానికి పరిగణనలోకి తీసుకోని అంశం ఏదీ?
a. తలసరి ఆదాయం
b. అక్షరాస్యత
c. జాతీయాదాయం
d. ఆరోగ్యం

4. భారత దేశంలోని ఏవైనా రెండు ప్రధాన భూస్వరూపాలు పేర్లు రాయండి?
5. ఈ కింది వానిలో గాంధీజీతో సంబంధం లేని అంశం?
a. శాంతిని కోరుతూ అడాల్ఫ్‌ హిట్లర్‌కి లేఖ రాయం 
b. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం
c. స్వతంత్ర్య భారతదేశం తొలి గణతంత్ర దినం నాడు నిరాహార దీక్షలు చేయడం 

6. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం?

7. అక్షరాస్యత శాతం అంటే ఏంటీ? 

8. డీడీటీ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాన్ని తెలుపుతూ రాచెల్ కార్బన్ రాసిన గ్రంథం?

9. IPCC విస్తరించి రాయండి?

10. జుగ్గి జోప్టలు అనగానేమీ? 

11. ఈ కింది వానిలో భారతీయ బహుజాతి సంస్థ ఏదీ? 
a. నోకియా
b. రాన్‌బాక్సి
c. హోండా
d. నైకీ

12. ఆస్ట్రియా, ఇండియా, అమెరికా జపాన్ దేశాలను పశ్చిమ నుంచి తూర్పునకు అమర్చండి?

    సెక్షన్ -II  

అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి                            8X2=16

ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు 

13. వ్యవస్థీకృత రంగం అంటే ఏమిటి? ఉదాహరణలు రాయండి.  

14.పశ్చిమ విక్షోభాలు అని వేటిని అంటారు?

15. ప్రపంచయుద్ధాల్లో కూటమి, అగ్రరాజ్యాల కూటములో ఉన్న దేశాలను పట్టిక రూపంలో రాయండి?


16.  (ఏ) పై పటంలోని సమాచారం ఏ అంశానికి సంబంధించింది?
 (బీ) ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశం ఏదీ?
 (సీ) 2005 నాటికి అమెరికాలో ఎన్ని అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి?
 (డీ) ఏ దశాబ్ధంలో రష్యా ఎక్కువ అణ్వాయుధ నిల్వలు కలిగి ఉంది? 

17. తుంగభద్ర నదీ జలాలను పంచుకునే రాష్ట్రాలు ఏవీ? 

18. సుస్థిర అభివృద్ధి అనగానేమి? 

19. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి నాలుగు  నినాదాలు రాయండి?

20. భారతదేశంలో వలసలకు దారి తీస్తున్న ఏవైనా రెండు కారణాలు రాయండి?

  సెక్షన్-III 

అన్ని ప్రశ్నలకు జవాబులు రాయండి                                       8X4=32

21. తూర్పు తీర మైదానానికి, పశ్చిమ తీర మైదానానికి గల తేడాలు రాయండి

22. ప్రపంచంలో తీవ్ర ఆర్థిక మాంధ్యం ఫలితాలను రాయండి?

23. అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యాన్ని వెనక్కి తీసుకెళ్లిందని ఎలా చెప్పగలవు?

24.  పశ్చిమాన ఉన్న గుజరాత్‌తో పోలిస్తే అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు గంటల ముందుగానే సూర్యుడు ఉదయిస్తాడు. కానీ గడియారాలు ఒకే సమయాన్ని చూపుతాయి ఎందుకు?

25. పంచశీల సూత్రాలను తెలుపుము?

26. నీటి వనరుల విషయంలో అంతర్గత, బాహ్య ప్రవాహాలను ప్రక్రియను గురించి చిన్న వ్యాసం రాయండి?

27.  ఈ కింది ఇచ్చిన సమాచారం ఆధారంగా కమ్మీ చిత్రాన్ని గీసి మీ పరిశీలన రాయండి? నాలుగు ప్రశ్న జవాబులు కూడా రాయండి?
 పట్టిక- భారతదేశ జనాభా- స్త్రీ పురుషుల నిష్పత్తి

క్రమ సంఖ్య  సంవత్సరం లింగ నిష్పత్తి
1 1951 `946
2 1961 941
3 1971 930
4 1981 934
5 1991 929
6 2001 933
7 2011 943

28. ప్రపంచంలో శాంతి నెలకొల్పటానికి ఐక్యరాజ్యసమితి నిర్వహించే పాత్ర ఏంటీ?
 

సెక్షన్-IV

ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక ఉంది. వాటి నుంచి ఒకటి ఎంపిక చేసి రాయాలి

29. భారత దేశంపై ప్రపంచీకరణ ప్రభావాన్ని రాయండి?
                                            లేదా
భూగంలో వేడెక్కడంలో శీతోష్ణస్థితి మార్పులు ఏ విధంగా కారణే రాయండి? 

30. ఏక పార్టీ ఆధిపత్యం భారత ప్రజాస్వామ్య విధానానికి సరైనది కాదు. దీంతో నీవు ఏకీభవిస్తున్నావా? లేదా? వ్యాఖ్యానించండి?
                                      లేదా
యుద్ధంలో గెలిచిన దేశాలు కూడా దేబ్బతింటాయి- వ్యాఖ్యానించండి

31. ఖనిజాలు, ఇతర సహజవనరులను వేగంగా సంగ్రహించడం వల్ల భవిష్యత్‌ అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. మీరు ఏకీభవిస్తారా? కారణాలు రాయండి?
                                          లేదా
భారత రాజ్యాంగం  మౌలిక సూత్రాల గురించి వ్యాసం రాయండి? 

32. భారత దేశం, వియత్నాం లాగా స్వాతంత్ర్యం కోసం అంతకష్టపడాల్సి రాలేదు. దీనికి గల కారణాలను రాయండి?
                                           లేదా
ప్రస్తుతం ప్రపంచంలో గ్రీన్‌పీస్‌ వంటి పర్యావరణ ఉద్యమాల ప్రాముఖ్యత రాయండి



33A. ప్రపంచ పటంలో ఈ కింది వాటిని గుర్తించండి
 1. పోలెండ్‌ 2. న్యూయార్క్‌ 3. జపాన్ 4. ఇటలీ  
 లేదా
 1.కెనడా 2. ఫ్రాన్స్‌ 3. నైజీరియా 4. వియత్నాం  

33B. మీకు ఇచ్చిన ఇండియా మ్యాప్‌లో వీటిని గుర్తించండి
 1. ఆరావళి పర్వతాలు 2.నర్మదా నది 3. చోటానాగపూర్ పీఠభూమి 4. K2 శిఖరం  
 లేదా
1.కోరమండల్‌ తీరం 2. ఇటానగర్ 3. థార్‌ ఎడారి 4. లడఖ్‌  

 


పేపర్‌ డిజైన్ చేసింది: వెంకటరావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, 97040 86547

 

Published at : 01 Mar 2023 09:01 AM (IST) Tags: SSC Exams SSC Exam Model Paper SSC Exam Social Model Paper-2023

సంబంధిత కథనాలు

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?

GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే