అన్వేషించండి

AP SSC Results: ఏప్రిల్ 22న ఏపీ పదోతరగతి ఫలితాల వెల్లడి - ఎన్నిగంటలకంటే?

AP 10th Class Results: ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

AP Tenth Class Results: ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ముహూర్తం ఖరారుచేసింది. పదోతరగతి ఫలితాలను ఏప్రిల్ 22న ప్రకటించనున్నారు. విజయవాడలో ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు.. డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 20న ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6.23 లక్షలు, గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు. 

ఏపీలో లోక్ స‌భ, అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో.. అత్యంత వేగంగా ప‌దోత‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్షల పరీక్షాపత్రాల మూల్యాంక‌నం పూర్తిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. గతేడాది మే 6న పదోతరగతి పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్రఅసెంబ్లీకి మే 13న ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆలోపే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 22న ఫలితాల వెల్లడికి డేట్ ఫిక్స్ చేశారు. 

పదోతరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్‌, మార్చి 20న ఇంగ్లిష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించగా.. మార్చి 28, 30 తేదీల్లో వొకేషనల్ పరీక్షలు నిర్వహించారు.

గతేడాది 18 రోజుల్లోనే ఫలితాలు..
ఏపీలో గతేడాది పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు నిర్వహించారు. ఫలితాలను మే 6న విడుదల చేశారు. అంటే పరీక్షలు ముగిసిన 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈసారి మాత్రం 23 రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను అధికారిక వెబ్ సైట్లు bse.ap.gov.in , www.results.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు..  దీంతోపాటు  వెబ్‌సైట్‌లలోనూ  ఫలితాలు చూసుకోవచ్చు.

AP SSC ఫలితాలను ఇలా చూసుకోండి..

➥  విద్యార్థులు ఫలితాల కోసం మొదట BSEAP అధికారిక సైట్‌ని సందర్శించాలి-bse.ap.gov.in.

➥ హోమ్‌పేజీలో అందుబాటులో 'AP SSC 2024 Results' లింక్‌పై క్లిక్ చేయాలి.

➥ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదు చేసి, సబ్‌మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.

➥ పూర్తయిన తర్వాత మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

➥ ఆ తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

ALSO READ:

తెలంగాణ టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు మార్చి 18న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించారు. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల నేపథ్యంలో అత్యంత వేగంగా ప‌దోత‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్షల పరీక్షాపత్రాల మూల్యాంక‌నం పూర్తిచేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులు చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి జవాబుపత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 11 నాటికి పదోతరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం పూర్తి కానుంది. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వ్యాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే.. గతేడాదితో పోలిస్టే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే.. ఫలితాలు కూడా కొంత ముందుగానే వెలువడనున్నాయి. 

గతేడాది తెలంగాణ‌లో ఏప్రిల్ 3 ఏప్రిల్ 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను మే 10న విడుద‌ల చేశారు. అయితే ఈ సారి లోక్ స‌భ ఎన్నిక‌ల నేపథ్యంలో..  మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. గతేడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 25 నుంచి 33 రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొద‌టి వారంలో తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం స్పష్టంగా ఉంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match HighLights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీPBKS vs RCB Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamMI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
Ayush Mhatre Record: నిన్న వైభవ్,  నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
నిన్న వైభవ్, నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
Embed widget