(Source: ECI/ABP News/ABP Majha)
INICET Results: ఎయిమ్స్ ఐఎన్‌ఐసెట్ - 2024 జనవరి సెషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
పీజీ వైద్య కోర్సుల్లో 2024, జనవరి సెషన్ ప్రవేశాలకు నవంబరు 5న నిర్వహించిన 'నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ (INICET)' కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫలితాలను AIIMS అధికారులు విడుదల చేశారు.
పీజీ వైద్య కోర్సుల్లో 2024, జనవరి సెషన్ ప్రవేశాలకు నవంబరు 5న నిర్వహించిన 'నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ (INICET)' కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫలితాలను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సైన్సెస్ (AIIMS) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు.
పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను హాల్‌టికెట్ నెంబర్లతోపాటు, కేటగిరీల (స్పాన్సర్డ్, ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్)వారీగా ప్రకటించారు. ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, సంబంధించి మొత్తం 30,715 మంది అర్హత సాధించగా, ఎండీఎస్ కోర్సుకు నిర్వహించిన పరీక్షకు మొత్తం 2,454 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో నమోదు చేసిన అర్హతలు, కేటగిరీ సర్టిఫికేట్, స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ మొదలు వివరాల ఆధారంగా ఫలితాలను విడుదల చేశారు. ఒకవేళ వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లు తేలితే ప్రవేశాల సమయంలో అభ్యర్థిత్వాన్ని రద్దుచేస్తారు.
ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లాలి. - aiimsexams.ac.in
➥ అక్కడ హోంపేజీలో 'Results' లేదా 'INI-CET January 2024 Session' ఫలితాల లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ వెంటనే ఫలితాలు కంప్యూటర్ తెరమీద దర్శమిస్తాయి.
➥ పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలను చూసుకోవచ్చు. కోర్సులవారీగా అర్హత సాధించిన అభ్యర్థులు వివరాలను అందుబాటులో ఉంచారు.
ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా.. ఆరేళ్ల వ్యవధి గల ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, ఎండీఎస్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎయిమ్స్(న్యూఢిల్లీ), జిప్‌మర్(పుదుచ్చేరి), నిమ్‌హాన్స్(బెంగళూరు), పీజీఐఎంఈఆర్ (చండీగఢ్), ఎస్‌సీటీఐఎంఎస్ టీ(తిరువనంతపురం)తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌లలో పీజీ (ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, ఎండీఎస్) సీట్లను భర్తీ చేస్తారు.
భారత్‌లో ఎయిమ్స్ సెంటర్లు: న్యూఢిల్లీ, భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, నాగ్‌పుర్, పట్నా, రాయ్ పూర్, రిషికేశ్, రాయ్ బరేలీ, గోరఖ్‌పూర్, కల్యాణి, బతిండా, గువాహటి, విజయ్‌పూర్, బిలాస్‌పూర్, మదురై, దర్భాంగా, కశ్మీర్, డియోఘర్, రాజ్‌కోట్, మనేతి, మణిపూర్, కర్ణాటక, బీబీనగర్, మంగళగిరి.
కటాఫ్ మార్కులు ఇలా..
➥ అన్ రిజర్వ్‌డ్ (యూఆర్), ఈడబ్ల్యూఎస్, స్పాన్సర్డ్, డిప్యూటెడ్, ఫారిన్ నేషనల్స్, భారత్‌కు చెందిన విదేశీ అభ్యర్థులకు 50 పర్సంటైల్‌గా నిర్ణయించారు.
➥ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, భూటాన్ దేశానికి చెందిన అభ్యర్థులకు 45 పర్సంటైల్ కటాఫ్‌గా నిర్ణయించారు.
ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫలితాలు అందుబాటులో..
ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో సూపర్ స్పెషాలిటీ (INI-SS-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ) కోర్సుల పరీక్షల(Exams) ఫలితాలను (results)విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో జనవరి 2024 సెషన్‌కు సంబంధించి డీఎం(DM), ఎంసీహెచ్(MCH), ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్(MD Hospital Administration) కోర్సుల ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారా సులభంగా ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నెంబర్లతో ఫలితాలను పొందుపరిచారు. కోర్సులవారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే.. డీఎం కోర్సుల్లో 1054 మంది అభ్యర్థులు, ఎంసీహెచ్ కోర్సుల్లో 661 మంది అభ్యర్థులు, ఎండీ కోర్సులో 9 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..