అన్వేషించండి

Anantapur: అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 

Anantapur Crime News: సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లాలోని రాముడి రథం దగ్ధం కేసులో నిందితుడు చిక్కాడు. గ్రామంలో ఉన్న విభేదాల కారణంగా ఇలా చేసినట్టు తేల్చారు.

Anantapur: అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో రామాలయం రథానికి నిప్పు పెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టినవారు ఎవరైనా సహించలేదని దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ జగదీష్ అండ్ టీం 24 గంటల్లోనే రామాలయం రథానికి నిప్పు పెట్టిన నిందితులను అరెస్టు చేశారు. 

సెప్టెంబర్‌ 23న అర్ధరాత్రి సమయంలో అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాముల వారి రథానికి నిప్పు పెట్టారు. మండపంలో భద్రపరిచిన ఉండగా దుండగులు ఈ పని చేశారు. తాళాలు పగులకొట్టి, మండపంలోకి ప్రవేశించి రథంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు మంటలు ఆర్పారు. అప్పటికే రథం ముందు భాగం కాలిపోయింది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ అండ్ టీం దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో పలు కీలక అంశాలు గుర్తించారు. హనకనహళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022లో ఎర్రస్వామి రెడ్డి బ్రదర్స్‌ సొంత డబ్బులు 20 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేయించారు. ఇదే గ్రామస్తుల మధ్య విభేదాలకు కారణమైంది. ఆ విభేదాలతోనే రథానికి నిప్పు పెట్టారు. 

రాయదుర్గం సీఐ వెంకటరమణ ఎస్ఐ నాగ మధు ఆధ్వర్యంలో కేసు విచారించి వైసిపి కార్యకర్త బొడిమల్ల ఈశ్వర రెడ్డిని అరెస్టు చేశారు. బొడిమల్ల ఈశ్వర రెడ్డిని పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారిస్తే సహాయం చేసిన వారి వివరాలు తెలుస్తాయని అంటున్నారు. ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

Also Read: దసరా నుంచి దీపావళి వరకు - అక్టోబర్‌లో బ్యాంక్‌లకు భారీగా సెలవులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : నారా  లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
Harsha Sai: నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
Anantapur: అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : నారా  లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
Harsha Sai: నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
Anantapur: అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
Malayalam Actor Siddique: పరారీలో మలయాళ నటుడు సిద్ధిఖీ... రేప్ కేసులో బెయిల్ ఇవ్వని హైకోర్టు
పరారీలో మలయాళ నటుడు సిద్ధిఖీ... రేప్ కేసులో బెయిల్ ఇవ్వని హైకోర్టు
Lavanya Tripathi : వదినను చూస్తే పిచ్చిలేస్తుంది.. మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై నిహారిక కంప్లైంట్!
వదినను చూస్తే పిచ్చిలేస్తుంది.. మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై నిహారిక కంప్లైంట్!
Revanth Reddy: మూసీ నిర్వాసితులకు బిగ్‌ రిలీఫ్‌- గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
మూసీ నిర్వాసితులకు బిగ్‌ రిలీఫ్‌- గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
Startup layoffs : స్టార్టప్‌ల పొలాల్లో మళ్లీ మొలకలొస్తున్నాయ్ - 70 శాతం తగ్గిన లే ఆఫ్‌లు - ఇక రిక్రూట్‌మెంట్లు ?
స్టార్టప్‌ల పొలాల్లో మళ్లీ మొలకలొస్తున్నాయ్ - 70 శాతం తగ్గిన లే ఆఫ్‌లు - ఇక రిక్రూట్‌మెంట్లు ?
Embed widget