అన్వేషించండి

Year Ender 2022 : ఎమ్మెల్సీ డ్రైవర్ మృతదేహం డోర్ డెలివరీ టు ప్రేమోన్మాది హత్యలు ! ఏపీలో 2022లో సంచలనం సృష్టించిన నేరాలు - ఘోరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో ఇలా కూడా జరుగుతాయా అన్న నేరాలు.. ఘోరాలు ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. వాటిలో సంచలనం సృష్టించిననేరాలను ఇప్పుడు ఓ సారిగుర్తు చేసుకుందాం

 

Year Ender 2022 : crime news in andhra pradesh 2022 :   ఆంధ్రప్రదేశ్‌లో  ఎవరూ ఊహించని నేరాలు ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. అందులో స్వయంగా ఓ ఎమ్మెల్సీ.. తన మాజీ డ్రైవర్ నుంచి చంపేసిన డోర్ డెలివరీ చేయడం దగ్గర్నుంచి..   ప్రేమోన్మాది హత్యల వరకూ ఉన్నాయి. 

 
ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య 

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో తెచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అనంతరం అనంతబాబు పరారీలో ఉన్నాడు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు హాజరవుతూ ఏం జరగనట్లే వ్యవహరించారు. అయితే ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీని అరెస్టుచేశారు. నిందితుడు ఎమ్మెల్సీపై 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. మే 19న ఘటన జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందని అప్పట్లో పోలీసులు తెలిపారు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఇగో హర్ట్ అయ్యి నెట్టడంతో డ్రైవర్ చనిపోయాడని ఎస్పీ ఇచ్చిన వివరణపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 


హిందూపురం వైసీపీ నేత దారుణహత్య 

హిందూపురం నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.  రామకృష్ణారెడ్డి తన స్వగ్రామమైన చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దు వద్ద దాబా నిర్వహిస్తున్నారు.  దాబా మూసేసి కారులో ఇంటికి  వచ్చే సమయానికి మాట వేసిన  దుండగులు రామకృష్ణారెడ్డి కారు దిగడంతోనే ఆయన కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. మొత్తం 18 చోట్ల విచక్షణ రహితంగా నరికి పరారయ్యారు. పార్టీలో ఆధిపత్యం కారణంగా సొంత పార్టీ నేతలే హత్య చేసినట్లుగా తేలింది. 
 

నంద్యాలలో కానిస్టేబుల్ హత్య 

ఏపీలో సంచలనం మరో నేరం నంద్యాల కానిస్టేబుల్ హత్య.  నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను కిడ్నాప్‌ చేసి హతమార్చిన ఘటన ప్రజల్ని భయకంపితుల్ని చేసింది.  నంద్యాల డిఎస్పీ ఆఫీసులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గూడూరు సురేంద్రనాథ్‌ను ఆగష్టు 7వ తేది రాత్రి సుమారు 9గంటల సమయంలో నడిరోడ్డుపై హత మార్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గెలివి స్కూల్ ప్రక్కన ఉన్న మిరాకిల్ టాటూ షాప్ ప్రక్కనే ఉన్న నాగేంద్ర బైక్ షీట్ కవర్ షాపు దగ్గర 9 మంది నిందితులు కానిస్టేబుల్ గూడూరు సురేంద్రనాథ్‌తో గొడవ పెట్టుకున్నారు. కానిస్టేబుల్‌ మీద దాడిచేసి తీవ్రంగా గాయపరిచి, తిరుమల ఫర్నిచర్ షాపు దగ్గర దారిలో పోయే ఆటొను ఆపి ఆటొ డ్రైవరును బెదరించి ఆటొలో సురేంద్రనాథ్‌ను బలవంతంగా ఎక్కించుకున్నారు. ఆటొలో కత్తులతో పొడిచి, కొట్టుకుంటూ తీసుకెళ్లి హింసించారు. మహానంది రోడ్డులో ఉన్న చెరువు కట్ట మీద పిడి బాకులతో విచక్షణ రహితంగా పొడిచి చంపేశారు. 
 
గుంటూరులో దంత విద్యార్థిని హత్య  చేసిన ప్రేమోన్మాది !

పెళ్లికి నిరాకరించిందని గుంటూరులో ఓ ప్రేమోన్మాది  దంత వైద్యవిద్యార్థి తపస్విని దారుణంగా హత్య చేశాడు.   కృష్ణాజిల్లాకు ఉయ్యూరుకు తపస్వి, ఉంగుటూరు మండలం మణికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఈ పరిచయం ప్రేమగా చిగురించింది. పెళ్లి చేసుకోవాలని జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేయడంతో తపస్వి నిరాకరించింది. దీంతో ఉద్యోగం మానేసి జ్ఞానేశ్వర్ ఇంటి వద్దే ఉంటున్నాడు. పెద్దకాకాని సమీపంలోని తక్కెళ్లపాడులో స్నేహితురాలి ఇంటికెళ్లిన తపస్విని వెంబడించిన జ్ఞానేశ్వర్‌ మరోసారి పెళ్లి విషయమై ప్రస్తావించాడు. తపస్వి నిరాకరించడంతో ముందుగానే తెచ్చుకున్న సర్జికల్ బ్లేడుతో తపస్విపై దాడికి పాల్పడ్డాడు. గొంతు భాగానికి తీవ్రమైన గాయం తగలడంతో తపస్వి మరణించింది.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 


పెళ్లి చేసుకోనందని తుపాకీతో కాల్చి.. తాను కాల్చుకున్నాడు ! 
 
నెల్లూరు జిల్లా తాటిపర్తి అనే చిన్న గ్రామంవో కావ్య అనే యువతిని  సురేశ్‌ రెడ్డి  తుపాకీతో కాల్చి చంపేశాడు.  తాటిపర్తి గ్రామంలో పక్క పక్క వీధుల్లోనే వీరి ఇళ్లున్నాయి.  ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. రు. మరదలి వరస అయ్యే కావ్యను పెళ్లి చేసుకుంటానని, సంబంధం మాట్లాడాలని సురేశ్‌ రెడ్డి ఏడాది కిందటే తన తల్లిదండ్రులను కోరాడు. ఆయన కుటుంబ సభ్యులు కావ్య తల్లిదండ్రులను  కలిసి... సంబంధం కలుపుకొందామని అడిగారు. కానీ... ఈ పెళ్లికి కావ్య ఇష్టపడలేదు. కావ్యను పెళ్లి చేసుకోవాలన్న కోరిక నెరవేరకపోవడంతో సురేశ్‌ రెడ్డి రగిలిపోయాడు. ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు.  ‘మేడిన్‌ అమెరికా’ పిస్టల్‌ సంపాదించాడు. సరైన సమయం చూసుకుని పాయింట్ బ్లాంక్ లో కావ్యను కాల్చి చంపాడు. తర్వాత సురేష్ రెడ్డి కూడా అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. 
  

కర్నూలులో కోడళ్లను చంపేసిన మామ, భర్తలు

కర్నూలు  ఓర్వకల్లు నన్నూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కోడళ్లను మూఢనమ్మకాలతో తండ్రితో కలిసి భర్తలు చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది.  గోవన్న అనే వ్యక్తికి  గ్రామంలో 40 ఎకరాల వరకు భూమి ఉంది. ఇద్దరు కొడుకులు, వారికి పెళ్లిల్లు అయ్యాయి.  గోవన్న అనారోగ్యం చేయడంతో నాటు వైద్యుడు వద్దకు వెళ్లారు. కోడళ్లు మందు పెట్టారని చెప్పడంతో వాళ్లను చంపాలని ప్లాన్ చేశాడు. పిల్లలు పుట్టడం లేదు కాబట్టి వారికి మళ్లీ పెళ్లి చేస్తానని చెప్పి కొడుకుల్ని ఒప్పించి కోడళ్లను చంపేశారు.   


విశాఖలో భయం పుట్టించిన సైకో కిల్లర్ అరెస్ట్ 

వవిశాఖలో  మహిళలను చంపేసి… వారి ప్రైవేటు భాగాలను చూస్తూ ఎంజాయ్ చేసే సైకోను పోలీసులు ఈ ఏడాదే పట్టుకున్నారు. ఓ హత్య కేసులో రాంబాబు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తే సంచలన విషయాలు వెలుగు చూశాయి.    తనకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్లిపోవడంతో పాటు  ఇంటి యజమానురాలు కూడా తనను మోసం చేయడంతో ... ఆడవాళ్ళ మీద పగ పెంచుకున్న రాంబాబు  ఆడజాతి మొత్తాన్ని నాశనం చేయాలని హత్యలు ప్రారంభించాడు.  వాచ్ మెన్ భార్యలైతే ఈజీగా పని అయిపోతుందని భావించి మొట్టమొదటిసారి వాచ్ మెన్ దంపతులను హత్య చేశాడు.  చనిపోయింది ఆడ, మగ అని తెలుసుకునేందుకు, ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని చూసి నిర్ధారించుకునే వాడంట. రాంబాబును పట్టుకోవడంతో ఓ సైకో కటకటాల వెనక్కి వెళ్లాడు. 
 
ఆలయంలోనే పూజారి హత్య 

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో  శివాలయంలోని పూజారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లలో జరిగింది. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివ నాగేశ్వరరావు (55) ను గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం లోపలే హత్య చేశారు. తలపగులగొట్టి ఆయన్ను దారుణంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. ఎందుకు చంపాలో తెలియదు. గుళ్లోనే చంపడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలంరేగింది. 
  

ఏపీలో అత్యధికంగా హత్యలే కలకలం రేపుతున్నాయి. తీవ్రమైన నేరాల్లో హత్యలే ఎక్కువగా ఉంటున్నాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget