News
News
X

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ఏలూరు జిల్లా, రూరల్ మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు ఆత్మహత్య చేసుకున్నారు. చేపల చెరువు వద్ద విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నాయకుల వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే వివిధ వేదికలపై ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ వైసీపీ లీడర్ అలాంటి ఆరోపణలతోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన ఓ ఎంపీటీసీ కావడం ఇక్కడ మరో ట్విస్ట్. 

పార్టీ కోసం కట్టుబడి పని చేస్తున్న వారిపైనే నాయకులు ఇలా వేధింపులకు దిగడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాయని ఓ సెల్ఫీ వీడియో తీసి మరీ చనిపోయాడా వైసీపీ ఎంపీటీసీ. తన చేపల చెరువులను పట్టించి వేధిస్తున్నారని తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతినడంతో తట్టుకోలేక చనిపోతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా గ్రామీణ మండలం గుడివాకులంక గ్రామంలో జరిగింది. ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు చేపల చెరువు వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకుని అందులో తనను వేధించే వాళ్ల పేర్లు చెప్పారు.  

వాళ్లంతా కావాలనే కుట్ర పన్నారు..

చనిపోయే ముందు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తనను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు వెల్లడించారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో బాలరాజుకు మద్దతు ఇవ్వడం, రామారావుకు తాను సపోర్టు చేయకపోవడం వల్ల తనపై కక్ష పెంచుకున్నారని ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు తెలిపారు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నారని సాల్మన్ వెల్లడించారు. ఎన్నికల్లో వారికి సపోర్ట్ చేయకపోవడంతో కోపం, పగ పెంచుకుని తనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చాలా అవమానపరిచారని, తన చెరువులను పట్టించారని సాల్మన్ రాజు తెలిపారు. శారీరకంగా, మానసికంగా తనను వేధించారని సాల్మన్ కన్నీటి పర్యంతమయ్యారు.

తనను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని తెలిపారు సాల్మన్‌. తనను వేధింపులకు గురి చేసిన వారిలో ప్రభాకర్ రావు ప్రధాన వ్యక్తి అని, ఉంగర బాలరాజు, బలే నాగేశ్వర రావు, మోరు సింహాద్రి, మోరు లక్ష్మణ, మోరు రాజేష్ తనను ఇబ్బందులు పెట్టారని వెల్లడించారు. వీరిని వెనక ఉండి ప్రోత్సహించింది ఘంటసాల రంగబాబు అని తెలిపారు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు. తనను ఎలా వేధించాలో మార్గనిర్దేశం చేసింది, వారు సలహాలు, సూచనలు చేసింది ఘంటసాల రంగబాబు అని వివరించారు. తన చావుకు ఘంటసాల రంగబాబే ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. 

వీడియోలోని పూర్తి మాటలు..

"బలే ప్రభాకర్ రావు ప్రధాన వ్యక్తి, ఉంగర బాలరాజు, బలే నాగేశ్వరరావు, మోరు సింహాద్రి, మోరు లక్ష్మణ, మోరు రాజేష్ నా చెరువులు పట్టించేశారు. దీని వెనక ఉండి నడిపించింది, ప్రోత్సహించింది ఘంటసాల రంగబాబు. రాజేష్ వాళ్ల మామ. వారందరినీ పిలిచి మీటింగులు పెట్టించారు. అన్ని రకాలుగా వారిని నడిపించారు. ఘంటసాల రంగబాబు ప్రోత్సాహంతో వారు నా మీద బాగా రుబాబు చేశారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో బలే బాలరాజుకు మద్దతు ఇవ్వడం వల్ల, రామారావుకు సపోర్ట్ చేయకపోవడం వల్లే నన్ను వేధిస్తున్నారు. నా వాటాలు అమ్మకుండా చేశారు. డబ్బులు కట్టాలంటూ వేధించారు. కొత్త వాటాల్లో చిన్న పిల్లలకు రావాల్సిన డబ్బులు రాకుండా ఆపేశారు. వీరి వల్ల గుడివాకులంక గ్రామంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. రాజకీయపరంగా, పోలీసుశాఖ పరంగా గుడివాకులంకలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై దృష్టి పెట్టాలి. మా ఊరిలో అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన వ్యక్తుల భార్యలను వేధిస్తున్నారు. వారికి జీవనాధారమైన వాటాలను అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారు. గుడివాకులంక గ్రామంలో జరుగుతున్న అన్యాయాలపై పోలీసు శాఖ దృష్టి సారించాలి. అన్యాయాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నా. నేను చనిపోవడం వల్ల, నేను చెబుతున్న మాటల వల్ల గుడివాకులంక గ్రామస్థులకు న్యాయం జరుగుతుందని, వాస్తవాలు బయటపడతాయని వాటి ద్వారా గ్రామంలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."  అని చనిపోయే ముందు ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు వీడియో ద్వారా చెప్పారు.

Published at : 19 Aug 2022 03:51 PM (IST) Tags: AP Latest news YCP MPTC Salman Raju Committed Suicide MPTC Suicide MPTC Suicide Video YCP MPTC Suicide Selfie Video

సంబంధిత కథనాలు

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Vizag News: తల్లికి నవ్వుతూ బై చెప్పి గదిలోకెళ్లిన కొడుకు, నిమిషాల్లోనే ఊహించని ఘటన

Vizag News: తల్లికి నవ్వుతూ బై చెప్పి గదిలోకెళ్లిన కొడుకు, నిమిషాల్లోనే ఊహించని ఘటన

చైనా, పాకిస్థాన్ నుంచి నడిపిస్తున్న వ్యాపారం- లోన్‌ యాప్‌ కేసుల్లో కొత్త కోణం

చైనా, పాకిస్థాన్ నుంచి నడిపిస్తున్న వ్యాపారం- లోన్‌ యాప్‌ కేసుల్లో కొత్త కోణం

పుట్టిన రోజునాడు ప్రాణం తీసిన ఈత సరదా, ముగ్గురు విద్యార్థులు మృతి

పుట్టిన రోజునాడు ప్రాణం తీసిన ఈత సరదా, ముగ్గురు విద్యార్థులు మృతి

Nandyal News: వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లి విద్యార్థి మృతి, కాలుజారడం వల్లే!

Nandyal News: వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లి విద్యార్థి మృతి, కాలుజారడం వల్లే!

టాప్ స్టోరీస్

గుడివాడలో కొడాలి నానిని ఓడించేది ఎవరు?

గుడివాడలో కొడాలి నానిని ఓడించేది ఎవరు?

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!

Iran Hijab Protest: హిజాబ్‌ నిరసనలపై అధ్యక్షుడి ఫైర్- గీత దాటితే కఠిన శిక్ష తప్పదని వార్నింగ్

Iran Hijab Protest: హిజాబ్‌ నిరసనలపై అధ్యక్షుడి ఫైర్- గీత దాటితే కఠిన శిక్ష తప్పదని వార్నింగ్

APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!