Noida Murder Case: భార్యను ఇలా కూడా చంపుతారా ? - వీడు భర్త కాదు కట్న పిశాచి !
Dowry Murder: ఈ రోజుల్లోనూ కట్నం కోసం భార్యను చంపేవారు ఉన్నారు. అది కూడా అత్యంత కిరాతకం. ఈ నోయిడా కిరాతకుడు చేసిన పని చేస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది.

Greater Noida woman Murder: కాలం మారుతున్నా కొంత మంది మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. భార్య బ్యూటీ పార్లర్ బిజినెస్ చేయాలనుకుంటోందని .. ఇన్ స్టా రీల్స్ చేస్తోందని.ఎక్కువ కట్నం తీసుకు రావాలని వేధించాడు. చివరికి చంపేసాడు ఓ భర్త. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇది జరిగింది. విపుల్ భాటి అనే వ్యక్తి తన భార్యను కాల్చి చంపేశారు.
2016 డిసెంబర్‌లో గ్రేటర్ నోయిడాలోని సిర్సాలో నిక్కీ , కాంచన్ భాటి అనే అక్కా చెళ్లెళ్లు ఇంట్లో అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నారు. స్కార్పియో వాహనం , మోటార్ సైకిల్ కోసం కుటుంబం కట్నంగా డిమాండ్ చేసింది. నిక్కీ మొత్తం రూ.36 లక్షల కట్నం తీసుకు రావాలని కుటుంబం వేధింపులకు పాల్పడుతూ వస్తోంది. ఈ క్రమంలో వేధింపులు తీవ్రం అయ్యాయి. చివరికి ఆగస్టు 21న, నిక్కీని ఆమె భర్త విపిన్ భాటి, మరొక కుటుంబ సభ్యుడు కలిసి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
నిక్కీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేసి, తాను గతంలో నడిపిన బ్యూటీ పార్లర్‌ను తిరిగి తెరవాలనే కోరికను వ్యక్తం చేసిన తర్వాత ఈ గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. విపిన్, మరో మహిళ నిక్కీపై దాడి చేసి, ఆమె జుట్టు పట్టుకుని లాగడం, ఆమెపై లిక్విడ్ థిన్నర్ పోసి తీవ్రంగా కాలిన గాయాలపాలు చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిక్కీ మెట్ల మీదకు వెళుతుండగా కుప్పకూలిపోవడం ఒక వీడియోలో కనిపించింది.
ఆగస్టు 22 ఆదివారం నిక్కీని పోలీసులు విచారించారు, ఆమె గాయాలతో మరణించారు. కట్నం డిమాండ్ల కారణంగా ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విపిన్ భాటిని పోలీసులు పట్టుకున్నరాు. పారిపోయే ప్రయత్నం చేయడంతో కాల్పులు జరిపి మరీ పోలీసులు పట్టుకున్నారు. శనివారం అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. విపిన్ తల్లి ఆగస్టు 24 ఆదివారం అరెస్టు చేశారు. సోమవారం, ఆమె సోదరిని వివాహం చేసుకున్న ఆమె బావమరిది , మామను అదుపులోకి తీసుకున్నారు.
🚨 UP Woman Burned Alive Over Dowry in Greater Noida
— The Matrix (@thematrixloop) August 24, 2025
➡ Nikki, 26, beaten unconscious and set on fire by husband Vipin and in-laws.
➡ Rs 35 lakh dowry demanded despite giving SUV & valuables.
➡ Husband arrested; mother-in-law, father-in-law, brother-in-law also booked.
➡… pic.twitter.com/j7bzG81jfB
విచారణ సమయంలో, విపిన్ భాటి నేరాన్ని అంగీకరించారని , "పశ్చాత్తాపం లేదని" వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. ఆన్‌లైన్‌లో విడుదలైన అనేక వీడియోలు ఈ దారుణమైన దాడిని చూపిస్తున్నాయి, వాటిలో ఒక వ్యక్తి నిక్కీపై థిన్నర్ పోస్తున్నట్లు, మరొకటి విపిన్ ఆమెను శారీరకంగా దాడి చేస్తున్నట్లు , ఆమె తీవ్రంగా కాలిపోయి కుప్పకూలిపోతున్న దృశ్యాలు ఉన్నాయి.
అయితే దారుణమైన హత్య తర్వాత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యగా చూపించానలని ప్రయత్నించారు.కానీ దొరికిపోయారు.




















