అన్వేషించండి

పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడిపై యాసిడ్ దాడి, పూర్తిగా కాలిపోయిన ముఖం

Bihar Crime News: పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో బిహార్‌లో ఓ మహిళ ప్రియుడిపై యాసిడ్‌తో దాడి చేసింది.

Acid Attack:

ప్రియుడిపై యాసిడ్ దాడి..

బిహార్‌లోని పట్నాలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో ప్రియురాలు ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుడి ముఖం తీవ్రంగా కాలిపోయింది. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మొత్తం ఇద్దరు కలిసి ఈ దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సిమర్‌వాదా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు వివరించారు. తెల్లవారుజామున ఇద్దరు ఈ దాడికి పాల్పడినట్టు తెలిపారు. బాధితుడి పేరు ధర్మేంద్ర కుమార్‌గా వెల్లడించారు. ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న ధర్మేంద్రను ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 5 నెలలుగా ధర్మేంద్ర, సరిత కుమారి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తెల్లవారు జామున 2 గంటలకు సరిత..ధర్మేంద్రకి కాల్ చేసి కలవాలని చెప్పింది. ఆమెని కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రియురాలితో పాటు మరో వ్యక్తి ముఖంపై యాసిడ్ పోశారు. ఆ మంట తట్టుకోలేక గట్టిగా కేకలు వేశాడు. స్థానికులు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

"ధర్మేంద్ర ఆమెని కలవడానికి ఇంటికి వెళ్లాడు. కలిసి తిరిగి బయటకు వస్తుండగా ఆమెతో పాటు మరో వ్యక్తి వచ్చి యాసిడ్‌ దాడి చేశారు. కేకలు విని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు"

- పోలీసులు

5 నెలలుగా పరిచయం..

5 నెలలుగా ఆ మహిళతో తనకు పరిచయం ఉన్నట్టు బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ మహిళకు ఇప్పటికే పెళ్లైందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. భర్తతో వేరుగా ఉంటోందని వివరించాడు. పెళ్లి చేసుకోవాలని చాలా రోజులుగా ఆమె ఒత్తిడి చేస్తోందని, కానీ తనకు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందని తెలిపాడు. ఈ విషయంలోనే ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే ముఖంపై యాసిడ్ పోసింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. 

Also Read: ఫ్రెండ్‌తో ఆ పని చేయాలంటూ టార్చర్ చేసిన భర్త, ఒప్పుకోలేదని బెల్ట్‌తో చికతబాది

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget