అన్వేషించండి

Crime News: సీక్రెట్ సరోగసికి వచ్చిన మహిళ - 9వ అంతస్తు నుంచి పడి మృతి - మైహోమ్ భూజాలో ఏం జరిగింది ?

Hyderabad: మైహోమ్ భూజాలో ఓ మహిళ తొమ్మిదో అంతస్తు నుంచి పడి చనిపోయింది. ఇందులో సరోగసి కోణం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Mayhome Bhuja Women Death: హైదరాబాద్‌లో అత్యంత లగ్జరీ ఆపార్టుమెంట్ కాంప్లెక్స్‌లో ఒకటి అయిన మైహోభూజాలో ఓ మహిళ తొమ్మిదో అంతస్తు నుంచి పడి చనిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించి విచారణ ప్రారంభించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా.. లేకపోతే ఎవరైనా తోసేశారా..లేకపోతే పారిపోవడానికి ప్రయత్నించి కిందపడి చనిపోయారా అన్నది పోలీసులకు సస్పెన్స్ గా మారింది. అంతకు మించి ఆమె ఆ ఇంట్లోకి సరోగసి ద్వారా బిడ్డను కనిపెట్టడానికి వచ్చినట్లుగా గుర్తించారు. 

పిల్లలు లేని దంపతులకు బిడ్డను కనిపెట్టడానికి వచ్చిన మహిళ 

మైహోమ్ భూజాలో తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడిన మహిళ ఎవరు అన్నదానిపై పోలీసులు ఆరా తీశారు. ఏ ఫ్లాట్ నుంచి పడిందో ఆ ప్లాట్‌లో ఉండే కుటుంబసభ్యురాలు కాదు. ఆ ఫ్లాట్‌లో ఉండేవారికి పిల్లలు లేరు. వారికి సరోగసి ద్వారా పిల్లలను పుట్టించి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని ఆమె ఆ ఇంటికి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.రూ. పది లక్షలకు డీల్ మాట్లాడుకుని  భార్య, భర్త ఇద్దరూ వచ్చి ఆ ఇంట్లో ఉంటున్నారు. డాక్టర్ ట్రీట్‌మెంట్ ప్రక్రియ నడుస్తోంది. ఇంకా ఐవీఎప్ ప్రక్రియ చేయలేదని తెలుస్తోంది.                   

Also Read:  వీడేం మొగడండి బాబూ - వీసా తెచ్చుకుని ఆస్ట్రేలియా తీసుకెళ్లలేదని వదిలేశాడట !

పారిపోవడానికి ప్రయత్నించిన మహిళ

మహిళ చనిపోయిన భవనం తొమ్మిదో అందస్తులో .. రెయిలింగ్‌కు చీరలు కట్టి ఉన్నాయి. ఆ చీరల ద్వారా ఆమె కిందకు దిగేందుకు ప్రయత్నించారని పట్టు తప్పి కింద పడిపోవడం వల్ల చనిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఎందుకు పారిపోవాలనుకున్నారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె భర్త కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. సరోగసి ప్రాసెస్ కోసమే వచ్చామని అయితే ఇంటి యజమానికి అసభ్యంగా ప్రవర్తిస్తూండటంతో తన  భార్య పారిపోవాలనుకుందని కానీ.. పట్టు తప్పి పడి చనిపోయిందని ఆమె భార్య పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. 

Also Read: జీపీఎస్ తప్పిదంతో ప్రమాదం - నిర్మాణంలో వంతెనపై నుంచి పడిన కారు, ముగ్గురు మృతి

సరోగసిపై ఆంక్షలు                                                        

భారత్‌లో సరోగసిపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. అయితే కొన్ని ఆస్పత్రులు మాత్రం మహిళలతో సీక్రెట్ గా ఒప్పందాలు చేస్తున్నాయి. ఇలా పిల్లలు పుట్టే అవకాశం లేని దంపతులకు సరోగసికి ఒప్పందం చేయించారని కానీ ఆ మహిళ పారిపోవడానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ మహిళతో ఒప్పందం చేసుకున్న జంటపై కేసులు పెడతారో లేదో స్పష్టత లేదు. అత్యంత లగ్జరీ అపార్టుమెంట్‌లో అందరూ పలుకుబడి ఉన్నవారే ఉంటారు కాబట్టి.. కేసు క్లోజ్ అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget