Crime News: 50 ఏళ్ల భర్త , 30 ఏళ్ల భార్య - ఒక రోజు పొలంలో ముక్కలుగా భర్త శరీరం - ఈ స్టోరీ చాలా వయోలెంట్
Kill: కర్ణాటకలోని బెళగావిలోఓ మహిళ తన భర్తను రెండు ముక్కలుగా నరికేసింది. ఇతరులతో శృంగారం చేయమని ఒత్తిడి చేయడమే దీనికి కారణం.
Woman Cuts Husband Body Into 2 Pieces: కర్ణాటకలోని బెళగావిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి రెండు ముక్కలుగా చేసి పడేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పోలీసులు విచారణ జరిపి కీలక విషయాలు వెలుగులోకి తెచ్చారు. హత్య చేసింది ఆ వ్యక్తి భార్యేనని గుర్తించారు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందో తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.
భార్య, భర్తకు ఇరవై ఏళ్ల గ్యాప్
బెళగావిలో నివాసం ఉండే ఆ భార్యభర్తలకు వయసు గ్యాప్ ఇరవై ఎళ్లు ఉంది. తనకు పదమూడేళ్ల సమయంలో ముఫ్పై మూడేళ్ల వయసు ఉన్న వ్యక్తితో పెళ్లి చేశారు. వారికి ఓ అమ్మాయి కూడా ఉంది. వారి మధ్య సఖ్యత ఉండేది కాదు. ఆ భర్త స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. అలాంటిది ఓ రోజు హత్యకు గురై పొలంలో రెండు ముక్కలుగా కనిపించాడు.
భార్యే హత్య చేసిందని గుర్తించిన పోలీసులు
భర్తను రాయితో తలను పగులగొట్టి, మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి, ఆ భాగాలను సమీపంలోని వ్యవసాయ పొలంలో పడేశారు.పోలీసులు మృతదేహాం ఎవరిదో గుర్తించారు. వారింట్లో జరిగిన అన్ని పరిణామాలను చూసిన తర్వాత హత్యను భార్యే చేసిందని నిర్దారించారు. పెద్దగా కష్టపడకుండానే ఆమె తన నేరం ఒప్పుకుంది.
ఆ రోజు స్నేహితుల్ని తెచ్చిన భర్త ఏం చేశాడంటే ?
ఘటన జరిగిన రోజు ఆ మహిళ నిద్రలో ఉన్న సమయంలో భర్త తన స్నేహితుల్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. వారితో శృంగారం చేయమని ప్రోత్సహించాడు. ఆమె తిరగబడటంతో వారు వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత తన కోరిక తీర్చాలని భర్త ఆమెను వేధించాడు. కానీ దానికి ఒప్పుకోలేదు. అయితే అతను నిద్రపోతున్న కుమార్తె అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆ మహిళ రాయి తీసుకుని భర్త తలపై కొట్టి హత్య చేసింది. భర్తను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి రెండు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఉంచి సమీపంలోని వ్యవసాయ పొలంలో పడేసింది. డ్రమ్ములతో పాటు రక్తపు మరకలున్న బెడ్ షీట్, పరుపును కూడా తాడుతో కట్టేసి అదే బావిలో విసిరేసింది. తన భర్త ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అతడిని చంపినప్పుడు తాను ధరించిన దుస్తులను కాల్చేసింది.
అరెస్టు చేసిన పోలీసులు
తన భర్త తాగుబోతు అని, డబ్బుల కోసం తనను తరచూ వేధించేవాడని, తన వద్ద డబ్బులు లేవని చెప్పినప్పుడు డబ్బుల కోసం వేరే వ్యక్తులతో పడుకోమని బలవంతం చేసేవాడని ఆమె పోలీసులకు చెప్పింది. ఆమె చెప్పింది నిజమో కాదో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన మాత్రం కలకలం రేపింది. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవం ఉందని పోలీసులు నమ్మడం లేదు. అంతకు మించి ఏదో ఉందని అనుకుంటున్నారు. చాలా పక్కాగా ఆధారాలు ధ్వంసం చేసిందని పోలీసులు భావిస్తున్నారు.