అన్వేషించండి

Cop elopes with history sheeter : ఖాకీ ప్రేమ.. ఖైదీతో పరార్- పెళ్లి పీటల మీద పోలీస్ వరుడికి షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్!

Meerut: ఒక మహిళా కానిస్టేబుల్, తన పెళ్లిని అర్ధాంతరంగా ఆపేసి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌తో పరారైంది. పోలీసు అయిన పెళ్లి కొడుకు పెళ్లి మండపంలో ఎదురుచూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.

Woman cop elopes with  history sheeter: యూపీలోని మీరట్‌లో ఓ మహిళా పోలీసు..మరో పోలీసు అధికారి పెళ్లి జరుగుతోంది. పెళ్లికొడుకు వచ్చి మండపంలో ఉన్నాడు కానీ పెళ్లి కూతురు రాలేదు. తర్వాత అసలు విషయం తెలిసింది.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో ఆ మహిళా పోలీసు పెళ్లికుమార్తె వెళ్లిపోయిందని. 

 మీరట్‌కు చెందిన  ప్రీతి అనే మహిళా కానిస్టేబుల్ వివాహం మరో కానిస్టేబుల్‌తో ఘనంగా నిశ్చయమైంది. బంధుమిత్రుల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య పెళ్లి కొడుకు ఊరేగింపుగా  మండపానికి చేరుకున్నాడు. మరో కొద్ది నిమిషాల్లో పెళ్లి తంతు మొదలవ్వాల్సి ఉండగా, ముస్తాబైన వధువు గదిలో లేకపోవడంతో కలకలం రేగింది. తన కోసం తాళి పట్టుకుని ఎదురుచూస్తున్న వరుడిని, కుటుంబ గౌరవాన్ని గాలికి వదిలేసి ఆమె తన ప్రియుడితో కలిసి పరారైంది.                                    
 
రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. ప్రీతి సామాన్యుడితో కాదు, మీరట్ ప్రాంతానికి చెందిన కరుడుగట్టిన హిస్టరీ షీటర్  నవీన్ అనే నేరస్థుడితో ప్రేమలో ఉన్నట్లు తేలింది. నవీన్‌పై హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు వంటి అనేక కేసులు ఉన్నాయి. గతంలో ఒక కేసు విచారణ నిమిత్తం నవీన్‌ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కానిస్టేబుల్‌గా ఉన్న ప్రీతికి అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారి, చివరకు ఆమెను ఈ సాహసానికి పురికొల్పింది.             
 
ప్రారంభంలో ప్రీతిని ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. కానీ, ఆమె తన ఇష్టపూర్వకంగానే నవీన్‌తో వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నవీన్ తన గ్యాంగ్‌తో కలిసి మండపం సమీపానికి రాగా, ప్రీతి పెళ్లి దుస్తుల్లోనే దొడ్డిదారిలో వెళ్లి వారి వాహనం ఎక్కి వెళ్లిపోయింది.  తన వృత్తిని, బాధ్యతను పక్కన పెట్టి ఒక నేరస్థుడి నీడను కోరుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
 
మరోవైపు పెళ్లి కొడుకు పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పెళ్లి పీటల మీద వధువు చేసిన ఈ పనితో వరుడి కుటుంబం తీవ్ర అవమానానికి గురైంది.  చట్టాన్ని కాపాడాల్సిన చేతులే ఒక క్రిమినల్‌తో చేతులు కలపడం అత్యంత దారుణం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ వింత ప్రేమకథను విని ముక్కున వేలేసుకుంటున్నారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన కానిస్టేబుల్ ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
శాఖ ప్రతిష్టను మంటగలిపిన ప్రీతిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.  ఆమెను సస్పెండ్ చేయడమే కాకుండా, ఒక నేరస్థుడికి సహకరించినందుకు ఆమెపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం నవీన్, ప్రీతి కోసం ప్రత్యేక బృందాలు మీరట్ సహా సరిహద్దు ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. ఈ వింత ప్రేమకథ చివరకు ఎలాంటి ముగింపునకు చేరుకుంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల వారు సహా 18 మంది మృతి
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల వారు సహా 18 మంది మృతి
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget