Woman Jump to Death: అందరూ చూస్తుండగానే.. ఐదో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
Hyderabad : అపార్ట్మెంట్లోని ఐదో ఫ్లోర్ మీద నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆమెను సనా బేగంగా గుర్తించారు.
Woman Jump to Death : ఈ మధ్యకాలంలో ప్రతి సమస్యకు చావడం ఒక్కటే మార్గంగా ఆలోచించి విలువైన ప్రాణాలను మధ్యలోనే తుంచుకుంటున్నారు. అసలు ప్రస్తుత సమస్య ఎందుకు వచ్చింది? ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన కూడా ఇప్పటి కాలం మనుషుల్లో కరువైంది. ఎవరైనా మోసం చేసినా, ఓ విషయంపై ఎవరేమన్నా కామెంట్ చేసినా, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో సమస్యలు ఉన్నా వెంటనే అతిగా ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఆ వెంటనే తాము ఈ భూమ్మీద ఉండలేమని.. ఆత్మహత్యనే తమకు ఉన్న ఏకైక మార్గంగా భావించి కుటుంబాలను, పిల్లలను వదిలేసి ఆ దారిని ఎంచుకుంటున్నారు.
ఇటీవల కాలంలో ఆత్మహత్య ఫ్యాషన్ గా మారిపోయింది. చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకుంటున్నారు. నచ్చిన కూర వండలేదని భర్త.. కూర బాగుందని చెప్పలేదని భార్య, లవ్ ఫెయిల్యూర్ అయ్యామని యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య వాషింగ్ మిషన్ బాగుచేయించలేదనని ఫ్యాన్‌కు ఊరేసుకున్న భార్య, హాస్టల్లో ఉండలేనంటూ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు, ఉద్యోగం రాలేదని యువత ఆత్మహత్యలు వంటివి నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అలాంటి ఘటనే జరిగింది. వివరాలు తెలియకపోయిన అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఐదో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య
అపార్ట్మెంట్లోని ఐదో ఫ్లోర్ పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్‌లో ఉంటున్న ఓ మహిళ గిరి శిఖర అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు మీదకు ఎక్కింది. అక్కడ గోడపైకి ఎక్కి కూర్చుంది. అక్కడ ఈ విషయాన్ని స్థానికులు గమనించి దూకొద్దంటూ కేకలు వేస్తూనే ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా.. వారు తెరుకునే లోపు హఠాత్తుగా ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమె వద్దకు వెళ్లారు. ఆత్మహత్య చేసుకున్న మహిళను సనా బేగం (23)గా గుర్తించారు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మరణించినట్లు తెలుస్తోంది.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సనాబేగం ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం వివరాలు కనుక్కొనే పనిలో ఉంది. అయితే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.