అన్వేషించండి

Madhya Pradesh Murder: లవర్‌తో కలిసి భర్తను చంపేసింది - దొంగలపనేనని నమ్మించేసింది - కానీ దొరికిపోయింది!

Wife murder husband : మధ్యప్రదేశ్‌లో ఓ మర్డర్ మిస్టరీ, సినిమా ను తలపించేలా సాగింది. ఒక పక్క భర్త శవం.. మరోపక్క విలపిస్తున్న భార్య.. దొంగలు చంపేశారనే కథ. కానీ ఒక్క తప్పుతో భార్య దొరికిపోయింది.


Madhya Pradesh Killer Wife:  అది మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని ఒక ప్రశాంతమైన ఇల్లు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా హాహాకారాలు వినిపించాయి. స్థానికులు వెళ్లి చూసేసరికి ఇంటి యజమాని రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆయన భార్య తనను దొంగలు కట్టేశారని, తన కళ్లెదుటే భర్తను కిరాతకంగా చంపేశారని, ఇంట్లోని నగలు, నగదు ఎత్తుకెళ్లారని ఏడుస్తూ చెప్పింది. తన భర్తను చంపిన హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఆమె చేసిన రోదన చూసి చుట్టుపక్కల వారు, పోలీసులు కూడా మొదట చలించిపోయారు.

 పోలీసుల తనిఖీ.. బయటపడ్డ అసలు రంగు! 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా ఇంట్లో ఎంత సొమ్ము పోయిందో లెక్కేసేందుకు గదిని తనిఖీ చేశారు. అయితే, ఆ మహిళ ఏవైతే నగలు పోయాయని ఫిర్యాదులో పేర్కొందో, అవే నగలు ఆమె గదిలోని ఒక రహస్య మూలలో భద్రంగా కనిపించాయి. దొంగలు పడితే నగలు అక్కడే ఎందుకు వదిలేస్తారు  అన్న అనుమానం పోలీసులకు కలిగింది. దీంతో కేసు మలుపు తిరిగింది. బాధితురాలిగా నటిస్తున్న ఆమెపైనే నిఘా పెట్టిన పోలీసులు ఆమె కాల్ డేటాను విశ్లేషించారు.

 పక్కా ప్లాన్.. రూ. లక్ష సుపారీ! 

పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, వారిద్దరి ఏకాంతానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. ఇందుకోసం తన ప్రియుడి సాయంతో ఒక కిరాయి హంతకుడిని సంప్రదించింది. భర్తను హతమార్చేందుకు రూ. 1 లక్ష సుపారీగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాన్ ప్రకారం, దొంగతనం జరిగినట్లు నమ్మించేందుకు ఇంట్లోని నగలను తానే దాచిపెట్టి, భర్తను చంపిన తర్వాత దొంగలు వచ్చారని కట్టుకథ అల్లింది.

 కటకటాల వెనక్కి! 

హంతకుడు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆమె సహకరించడమే కాకుండా, తనను తాను తాడుతో కట్టేసుకుని బాధితురాలిగా నటించింది. అయితే, ఆమె  ఓవర్ యాక్షన్ చివరకు పోలీసులకు దొరికిపోయేలా చేసింది. దర్యాప్తులో పోలీసులు గట్టిగా నిలదీయడంతో ఆమె అసలు విషయాన్ని ఒప్పుకుంది. తన ప్రియుడితో కలిసి జీవించేందుకే ఈ దారుణానికి పాల్పడ్డానని అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను, ఆమె ప్రియుడిని, కిరాయి హంతకుడిని అరెస్ట్ చేశారు.   

 సినిమా లెవల్  యాక్షన్

భర్త చనిపోయిన బాధ ఏమాత్రం లేకుండా, తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆమె ప్రదర్శించిన నటన చూసి పోలీసు అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. చట్టం కళ్లుగప్పి తప్పించుకోవాలనుకున్న ఈ మాయలాడి ప్లాన్ చివరకు సెల్ ఫోన్ రికార్డులు ,  ఆమె గదిలో దొరికిన నగలతో బెడిసికొట్టింది. ప్రస్తుతం నిందితులందరూ కటకటాల వెనక ఊచలు లెక్కపెడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Fake Aadhaar Certificate Gang Arreste: ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
Adilabad Bangladesh Illegal Burglar Gang Arrest: దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
Krishna Crime: కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Embed widget