Tadepalligudem Crime : తాడేపల్లిగూడెంలో ప్రేమోన్మాది ఘాతుకం, యువతిపై కత్తితో దాడి!
Tadepalligudem Crime : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు.
Tadepalligudem Crime : పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. కొండ్రుప్రోలులో గురువారం అర్ధరాత్రి కల్యాణ్ అనే వ్యక్తి యువతి గొంతుకోశాడు. అడ్డొచ్చిన యువతి చెల్లెలు, తల్లిపై చాకుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడుతున్న కల్యాణ్‌ను... యువతి తండ్రి పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తుంది. గతంలోనూ యువతి తండ్రికి చెందిన గడ్డివాముకు కల్యాణ్ నిప్పుపెట్టినట్లు సమాచారం.
అసలేం జరిగింది?
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి 12.30గంటల సమయం లో బుడిగిన మాణిక్యం అనే యువతిపై చాకుతో దాడి చేశాడు రాజులపాటి కల్యాణ్ అనే యువకుడు. అడ్డువచ్చిన మాణిక్యం చెల్లెలు వెంకట లక్ష్మి, తల్లి భాగ్యలక్ష్మిపై కూడా కత్తితో దాడి చేశాడు. బాధితులను మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ కల్యాణ్ యువతి వెంటపడుతున్నట్లు తెలుస్తోంది. యువతి తండ్రి ఏడుకొండలు... కల్యాణ్ ను హెచ్చరించారు. దీంతో కక్షపెంచుకున్న కల్యాణ్ ఏడుకొండలు పశువుల మేతకు నిప్పు పెట్టిపెట్టాడు. అనంతరం నిన్న రాత్రి యువతిపై దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువతి కుటుంబ సభ్యులకూ గాయాలు
తన ప్రేమను అంగీకరించలేదనే అక్కసుతో కల్యాణ్ యువతితో పాటు ఆమె తల్లి, సోదరిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన గాజులపాటి కల్యాణ్ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఏడాదిగా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కల్యాణ్‌ను పలుమార్లు హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోని కల్యాణ్ యువతిపై పగ పెంచుకున్నాడు. గురువారం అర్ధరాత్రి ప్లాన్ ప్రకారం ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. యువతి దవడ, మెడ, వెన్నెముక, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో కల్యాణ్ ను అడ్డుకోవడానికి వచ్చిన యువతి తల్లి, చెల్లిపై కూడా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన బాధితులను స్థానికులు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుడు కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భార్యను హత్య చేసిన భర్త
ఆరేళ్ల క్రితం వారిద్దరికీ పెళ్లి జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ గత కొంత కాలంగా భర్తకు.. భార్యపై అనుమానం మొదలైంది. ఆమె మరెవరితోనే వివాహేతర సంబంధం సాగిస్తున్నట్లు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై తీవ్ర కోపోద్రిక్తుడై చంపాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఆపై మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి అంటే తల, మొండం వేరు చేసి కాలువలో పడేశాడు. అయితే కాలువలో శరీర భాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురికి చెందిన మహమ్మద్ అన్సరుల్, రేణుకా ఖాతూన్ భార్యా భర్తలు. వీరిద్దరికి ఆరేళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే పెళ్లైన తర్వాత వీరి మధ్య చాలానే విబేధాలు వచ్చాయి. కానీ కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని పరిష్కరించుకున్నారు. ఆపై కొంత కాలం వీరిద్దరూ బాగానే కలిసి ఉన్నారు. కానీ మహమ్మద్ అన్సురల్ కు.. భార్య రేణుకా ఖాతూన్ పై అనుమానం మొదలైంది. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోందని భావించాడు. అలా ఆమెపై విపరీతమైన కోపాన్ని పెంచుకున్నాడు. ఎలాగైనా సరే ఆమెను చంపి కోపాన్ని తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యను హత్య పథకం ప్రకారం హత్య చేశాడు.