అన్వేషించండి

APSRTC Bus : ఆర్టీసీ బస్సులో యువకుడు హల్ చల్, దుబాయ్ వెళ్లలేకపోయానని ప్రయాణికులపై కారంతో దాడి

APSRTC Bus : దుబాయ్ వెళ్లలేకపోయానన్న నిరాశలో ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో హల్ చల్ చేశాడు. తోటి ప్రయాణికులపై కారంచల్లాడు.

APSRTC Bus :  శంషాబాద్ నుంచి రాజోలు వెళ్తోన్న ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర బస్సులో ఓ ప్రయాణికుడు హల్ చల్ చేశాడు. తోటి ప్రయాణికులపై కారం చల్లి దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు అనే యువకుడు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లాడు. అయితే అతడి పాస్‌పోర్టు సరిగా లేనికారణంగా అధికారులు అతడ్ని తిరిగి పంపేశాడు. స్వగ్రామం తిరిగి వెళ్లేందుకు రాంబాబు ఆర్టీసీ ఇంద్ర బస్సు ఎక్కాడు. ఆర్టీసీ బస్సు పాలకొల్లు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ప్రయాణికులపై కారం చల్లాడు. ఈ పరిణామంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. కారం చల్లడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రయాణికులు యువకుడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు రాంబాబుని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టు అధికారులు పాస్‌పోర్టు సరిగాలేదని వెనక్కి పంపారని నిరాశలో యువకుడు తోటి ప్రయాణికులపై కారం చల్లాడని పోలీసులు నిర్థారించారు. 

దుబాయ్ చిక్కుకున్న సిరిసిల్ల యువకులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకొని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన గుగ్లోత్ అరవింద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పెద్దొళ్ల స్వామి, అదే జిల్లాకు చెందిన గొల్లపెళ్లి రాములు, అనిల్ అలాగే  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన నరేందర్ లు మూడ్రోజుల నుంచి దుబాయ్ విమానాశ్రయంలో నరకం అనుభవిస్తున్నారు. 

ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకుంటేనే

దుబాయ్ లోని ఓ కంపెనీ.. సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్ జిల్లా ఏజెంట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగం ఇచ్చారు. అయితే ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన ఐదుగురు యువకులకు కంపెనీ షాక్ ఇచ్చింది. ఏజెంట్లు చెప్పిన పని, జీతం వేరడవంతో కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మేం ఈ పని చేయలేమంటూ గొడవ పడ్డారు. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులను పిలిపించి తాగొచ్చి గొడవ చేస్తున్నారని కేసు బుక్ చేయించారు. ఈ క్రమంలోనే కంపెనీ నిర్వాహకులు ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకుంటే ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. దీంతో బాధితులు ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకున్నారు.  

 కేసులున్నాయని వెనక్కి 

బాధితుల పాస్ పోర్టులు ఇచ్చేసి వాళ్లను ఎయిర్ పోర్టు వద్ద వదిలేశారు. అయితే శనివారం రోజు రాత్రి వాళ్లు ఇండియాకు రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఐదుగురు యువకులు పాస్ పోర్టులు, టికెట్లు తీసుకొని ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లారు. ఐదుగురికి విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ పూర్తయింది. కానీ అక్కడి పోలీసులు వాళ్ల పాస్ పోర్టులు చెక్ చేసి.. మీ పైన కేసులు ఉన్నాయి, మీరు ఇండియాకి వెళ్లరాదని చెప్పి ఎయిర్ పోర్ట్ నుండి బయటకు పంపించారు. ఏం చేయాలో పాలుపోని యువకు ఇటు ఏజెంట్లు అటు కంపెనీ నిర్వాహకులకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో ఎయిర్ పోర్టు వద్దనే  కూర్చొని యువకులు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు వారికి ఏమవుతుందో ఏమోనని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరిని ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Embed widget