By: ABP Desam | Updated at : 15 Feb 2023 12:01 AM (IST)
వర్ధన్నపేటలో ముగ్గురు ఆశ్రమ పాఠశాల విద్యార్థినిల మిస్సింగ్
Wardhannapet Girls missing : వరంగల్ : ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 8వ తరగతికి చెందిన విద్యార్థి సెల్ ఫోన్ మాట్లాడడాన్ని తోటి విద్యార్థులు గమనించారు. వెంటనే వారు వార్డెన్ కు సమాచారం ఇవ్వడంతో విద్యార్థి వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నాడు. అనంతరం వార్డెన్ ఇంటికి వెళ్లిపోయాడు.
మంగళవారం ఉదయం టిఫిన్ చేసే క్రమంలో 8వ తరగతి బాలికలు ఇద్దరు.. 9వ తరగతి చెందిన మరో బాలిక కనిపించలేదు. దీంతో వారి గదిలో ఉండే విద్యార్థులను ఆరా తీయగా.. ఉదయం బయటికి వెళ్లిపోయారని చెప్పారు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు. బంధువులు,స్నేహితుల వద్ద వాకబు చేయగా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్డెన్ స్వరూప తెలిపారు. పోలీసులు కిడ్నాప్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గత సెప్టెంబర్ లో ఫుడ్ పాయిజన్ సమస్య
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత ఏడాది ఫుడ్ పాయిజన్ అయింది. సెప్టెంబర్ నెలలో ఫుడ్ పాయిజన్ కావడంతో పాఠశాలలో మొత్తం 150 మంది విద్యార్థులుండగా 60 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో విషమంగా ఉన్న వారిని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. మిగతా విద్యార్థినిలను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించగా కోలుకున్నారు. భోజనంలో బల్లిపడటంతో ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థినులు తెలిపారు.
వెస్ట్ మారేడ్‌పల్లి కస్తూర్బా కాలేజీలో మళ్లీ ఉద్రిక్తత, ఇంకా ఆసుపత్రుల్లోనే విద్యార్థులు
సికింద్రాబాద్.. వెస్ట్ మారేడ్‌పల్లి కస్తూర్బా కళాశాలలో రెగ్యూలర్ గా గ్యాస్ లీకేజీ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, చికిత్స కోసం హాస్పిటల్ లో చేరుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చెత్తకుండి నుండి వెలువడిన దుర్గంధం వల్లనే జరిగిందని అధికారులు, కాలేజ్ నిర్వాహకులు చెప్పడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 25 మంది విద్యార్థులు ఆ రోజు నుండి గీత, యశోదా, నిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పట్ల యాజమాన్యం కనీస బాధ్యత తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలేజీలో జరిగిన తప్పిదాలతో తమతో పాటు తమ కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గదువుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఇంకా ముగ్గురు విద్యార్థులు నిమ్స్ హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని విద్యార్థులు తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొందరు విద్యార్థులలో గుండెలో నీరు చేరిందని డాక్టర్లు చెబుతున్నారని విద్యార్థులు అన్నారు. ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ అస్వస్థతకు గురవ్వడం, మళ్ళీ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం ఇక్కడ పరిపాటిగా మారిందన్నారు. కాలేజీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాదం జరుతుండగానే మరో ముగ్గురు విద్యార్థులు స్పృహ తప్పిపడిపోవడం కలకలం రేపింది. ఆ విద్యార్థులను చికిత్స అందించేందుకు గీత హాస్పిటల్ కు తరలించారు.
Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !
Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి
Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్ బోల్తా పడి 20 మంది దుర్మరణం
Hyderabad Crime News: హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్
Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్