అన్వేషించండి

Vizianagaram Crime Report: విజయనగరంలో గంజాయి కల్చర్‌, వివాహేతర సంబంధాలతో హత్యలు - క్రైమ్ రిపోర్ట్ @2022

విజయనగరంలోనూ నేరాలు పెరిగిపోతున్నాయి. గంజాయి అక్రమ రవాణదారులపై 2021లో 32 కేసులు నమోదుకాగా.. 2022లో 50 కేసులు నమోదు చేసి, 89మందిని అరెస్టు చేశారు.

ప్రశాంతతకు మారుపేరైన విజయనగరంలోనూ నేరాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని ‘మత్తు’ కల్చర్‌ పెరుగుతోంది. గంజాయి రవాణాతోపాటు, వినియోగమూ అధికమవ్వడం.. ఇందులో యువతే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. 2022లో 50 గంజాయి రవాణా కేసులు నమోదై.. ఏకంగా 89 మంది అరెస్టయ్యారు. దీంతోపాటు సైబర్‌ నేరాలు, హత్యలు, హత్యాయత్నాలు పెరిగిపోతున్నాయి. 2022 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో నేరాల తీరుపై ఎస్పీ ఎం.దీపిక వార్షిక నివేదికను వెల్లడిరచారు. గంజాయి అక్రమ రవాణదారులపై 2021లో 32 కేసులు నమోదుకాగా.. 2022లో 50 కేసులు నమోదు చేసి, 89మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 3,180.855 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

గంజాయి వినియోగిస్తున్న వారిపైనా 24 కేసులు నమోదు చేశారు. మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి 2021లో అత్యాచారం కేసులు 76 నమోదుకాగా, 2022లో ఈ తరహా నేరాలు 34 శాతం తగ్గి, 50 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించే కేసులు 2021లో 218 నమోదుకాగా, 2022లో 19శాతం తగ్గి, 176 కేసులు నమోదయ్యాయి. 2021లో పోక్సో కేసులు 71 నమోదు కాగా, 2022లో వాటి సంఖ్య 38శాతం తగ్గి, 44 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 

హత్యల్లో ఎలా ఉందంటే..
2021లో 24 హత్యలు జరగా, 2022లో 23 హత్య కేసులు నమోదయ్యాయి. హత్యల్లో చాలా వరకు వివాహేతర సంబంధాలే కారణం కావడం గమనార్హం. 2021లో లాభాపేక్ష హత్యలు 3 నమోదు కాగా, 2022లో ఎటువంటి కేసూ నమోదు కాలేదు. 2021లో దోపిడీ కేసులు 10 నమోదు కాగా, 2022లో 4 దోపిడీ (రోబరీ) కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం కేసులు 2021లో 35 కేసులు ఉండగా.. 2022లో 12 హత్యాయత్నం కేసులే ఉన్నాయి. 2021లో 69మంది పిల్లలు తప్పిపోగా, 2022లో 82మంది తప్పిపోయారు. వంద శాతం వారిని కనుగొని తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించారు. ఆస్తికి సంబంధించిన నేరాల్లో 2022లో 1,64,35,352/-ల విలువైన ఆస్తులు చోరీకి గురి కాగా, వాటిలో 85శాతం రికవరీతో రూ.1,39,02,852/- ల విలువైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 

గతం కంటే పెరిగిన సైబర్‌ నేరాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా మోసగాళ్లు కూడా తమ పంథాను మారుస్తున్నారు. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అందుకు ఉదాహరణే జిల్లాలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు. సైబరు నేరాలకు సంబంధించి 2022లో 139 కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాది ఆ సంఖ్య 105గా ఉంది. సైబరు నేరాల నియంత్రణకు మహిళా పోలీసులతో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, డోర్‌ టూ డోర్‌ వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నేరం జరిగిన తరువాత ఫిర్యాదు చేయడం పట్ల అవగాహన కల్పించడం వల్ల కేసుల నమోదు సంఖ్య గత ఏడాది కంటే పెరిగిందని ఆమె చెప్పారు. 

తగ్గిన రోడ్డు ప్రమాదాలు
2021లో రహదారి ప్రమాదాల్లో 222 కేసులు నమోదై, 238 మంది మృతి చెందారు. 2022లో పోలీసు శాఖ చేపట్టిన భద్రత చర్యల ఫలితంగా 10శాతం తగ్గి 216 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య తొమ్మిది శాతం తగ్గి, 216 మంది మృతి చెందారు. 2022లో డిస్పోజ్‌ అయిన కేసుల్లో 60శాతం నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. 6,171 కేసులు 2022లో డిస్పోజ్‌ కాగా, వాటిలో 3,698 కేసుల్లో నిందితులను శిక్షించారు. జిల్లా వ్యాప్తంగా సారా ప్రభావిత 77 గ్రామాలను గుర్తించి, ఆయా గ్రామాల్లో పూర్తిగా సారాను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 79 కుటుంబాలను గుర్తించి, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు రూ.43.31 లక్షల ఆర్ధిక సహాయాన్ని 121 మందికి అందించారు. 

ముఖ్యమైన కేసుల ఛేదన ఇలా.. 
ఈ ఏడాది ఫిబ్రవరిలో రవి జ్యూవలరీ షాపులో చోరీ జరిగింది. ఈ నేరాన్ని 24 గంటల వ్యవధిలో ఛేదించి 1.180 కిలోల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. మరో కేసులో మోటారు సైకిలు డిక్కీ నుంచి దొంగిలించిన రూ.5.30 లక్షల నగదును 48 గంటల్లోనే ఛేదించారు. పూసపాటిరేగ పోలీసు స్టేషను పరిధిలో హత్య కేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసి, నిందితులను అరెస్టు చేసి, హత్య మిస్టరీని ఛేదించామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Embed widget