News
News
X

Visakha News : విశాఖ సాయి ప్రియ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్, యువతి తండ్రిపై కేసు నమోదు!

Visakha News : విశాఖ సాయి ప్రియ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సాయిప్రియ తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

FOLLOW US: 

Visakha News : విశాఖ పోలీసులు, నేవీని తిప్పలుపెట్టిన సాయి ప్రియ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నేవీ, కోస్ట్ గార్డ్, పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేసినందుకు సాయి ప్రియ, ఆమె ప్రియుడిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా సాయిప్రియ తండ్రి అప్పలరాజుపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అతడిపై కూడా కేసు నమోదు చేసినట్లు విశాఖపట్నం త్రీటౌన్ సీఐ రామారావు తెలిపారు. సాయి ప్రియ ప్రియుడితో వెళ్లిపోతున్నట్లు తన తండ్రికి సమాచారం ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని అతడు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని సాయి ప్రియ భర్త ఫిర్యాదు చేశారు.  ప్రభుత్వ ఉద్యోగి అయిన సాయి ప్రియ తండ్రి అప్పలరాజు ప్రభుత్వ ధనాన్ని వృథా చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. కోర్టు అనుమతితో సాయి ప్రియ తండ్రిపై 182 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.   

సాయిప్రియ, ప్రియుడిపై కేసు 

విశాఖలోని ఆర్కే బీచ్ లో అదృశ్యం అయిన సాయిప్రియ కేసులో పోలీసులు యాక్షన్ షురూ చేశారు. బీచ్‌లో కనిపించకుండా పోయిన వివాహిత సాయి ప్రియ బెంగళూరుతో ప్రియుడితో ప్రత్యక్షం కావడం తెలిసిందే. అయితే ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె ప్రభుత్వ ధనంతో పాటు సమయాన్ని వృథా చేసినందుకు అలాగే కట్టుకున్న భర్తను మోసం చేయడం, అతడికి విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని పెళ్లి వివాహం చేసుకోవడంతో కోర్టు అనుమతి, ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 420, 417, 494, 202 రెడ్ విత్ 34 కింద సాయిప్రియ ఆమె ప్రియుడు రవితేజలపై కేసు రిజిస్టర్ చేసినట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. అయితే తన యోగ సమాచారం తెలపాల్సిన బాధ్యత  ఉన్నప్పటికీ ఆమె దాచి పెట్టిందని అన్నారు. అందుకే ఆమె, ఆమె ప్రియుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు. 

అసలేం జరిగిందంటే?

ఆగస్టు 25వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ కు సాయి ప్రియ తన భర్త శ్రీనివాస రావుతో కలిసి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఇద్దరూ సరదాగా గడిపారు. ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో కాళ్లు కడుక్కొని వస్తానని చెప్పి సాయిప్రియ అలల వద్దకు వెళ్లింది. అప్పుడే శ్రీనివాస రావుకు ఫోన్ వచ్చింది. అతను ఫోన్ మాట్లాడి అటు చూసే లోపు ఆమె అక్కడ కనిపించలేదు. దీంతో తన భార్య సాయిప్రియ అలల్లో కొట్టుకుపోయిందని భావించిన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సాయి ప్రియను వెతికేందుకు అధికార యంత్రాంగమంతా సముద్రతీరానికి చేరుకుంది. దాదాపు రెండ్రోజుల పాటు నేవీ అధికారులు హెలికాప్టర్, బోట్లు ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా గాలింపు చర్యలు జరుగుతుండగానే సాయిప్రియ తాను ప్రియుడితో వెళ్లిపోయినట్టు సమాచారం అందించి అందర్నీ షాక్‌కి గురి చేసింది.

Also Read : Visakha News : విశాఖ ఆర్కే బీచ్ టు పోలీసు స్టేషన్ వయా బెంగళూరు, సాయి ప్రియ కేసులో ట్విస్టులు!

Also Read : Viral Video: అమ్మాయి ఫోన్ లాక్కెళ్లిన దొంగ, అతడు ఎవరో తెలిసి షాకైన యువతి

Published at : 30 Aug 2022 06:18 PM (IST) Tags: Visakha News navy Visakha Police Sai Priya Episode case on sai priya father viskha police

సంబంధిత కథనాలు

Nayeem case: నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు

Nayeem case: నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న ఇన్నాళ్లూ అక్కడే తలదాచుకున్నాడు

Cannabis Seized In Hyderabad: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్, 98 కిలోల గంజాయి స్వాధీనం

Cannabis Seized In Hyderabad: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్, 98 కిలోల గంజాయి స్వాధీనం

Hyderabad Crime: లేపేస్తామని బెదిరిస్తే, ఏకంగా రౌడీ షీటర్‌ను చంపేశాడు! మరో ట్విస్ట్ ఏంటంటే

Hyderabad Crime: లేపేస్తామని బెదిరిస్తే, ఏకంగా రౌడీ షీటర్‌ను చంపేశాడు! మరో ట్విస్ట్ ఏంటంటే

Shocking News: 58 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, జాయిన్ అవ్వకముందే బీటెక్ గ్రాడ్యుయేట్ ఆకస్మిక మృతి

Shocking News: 58 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, జాయిన్ అవ్వకముందే బీటెక్ గ్రాడ్యుయేట్ ఆకస్మిక మృతి

Telangana Maoists: పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టుల కలకలం, అగ్రనేత సంచారంపై అలజడి

Telangana Maoists: పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టుల కలకలం, అగ్రనేత సంచారంపై అలజడి

టాప్ స్టోరీస్

Vijayashanti: పండక్కి పైసలెట్ల? సర్కార్ ఉద్యోగులే కేసీఆర్‌ను పడగొడతరు - విజయశాంతి

Vijayashanti: పండక్కి పైసలెట్ల? సర్కార్ ఉద్యోగులే కేసీఆర్‌ను పడగొడతరు - విజయశాంతి

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి