Viral Video: అమ్మాయి ఫోన్ లాక్కెళ్లిన దొంగ, అతడు ఎవరో తెలిసి షాకైన యువతి
రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయి ఫోన్ కొట్టేశాడు ఓ దొంగ.. చివరకు ఆ దొంగ ఎవరో తెలిసి అంతా షాక్ అయ్యారు..
ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు యువకులు.. రకరకాల నేరాలకు పాల్పడుతున్నారు. చైన్ స్నాచింగ్స్ మొదలుకొని పెద్ద పెద్ద క్రైమ్స్ చేసేందుకు సైతం వెనకాడటం లేదు. ముఖ్యంగా పెద్ద సిటీల్లో చైన్ స్నాచర్లు, ఫోన్ స్నాచర్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. చాలా మంది రోడ్ల మీద ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. వారిని టార్గెట్ చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. టూవీలర్ మీద వారి వెనకాలే వచ్చి.. ఫోన్, లేదంటే చైన్లు లాక్కుని ఎవరికీ దొరక్కుండా పారిపోతున్నారు. తాజాగా ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తున్న ఓ అమ్మాయికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చివరకు ఊహించని ట్విస్ట్ తో అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
అమ్మాయి ఫోన్ కొట్టేసిన దొంగ
రోడ్డు రద్దీగా ఉంది. వాహనాల రాకపోకలు సైతం బాగానే ఉన్నాయి. ఇంతలో ఓ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుకుంటూ రోడ్డు పక్క నుంచి వెళ్తున్నది. ఇంతలో ఓ దొంగ టూ వీలర్ నడుపుకుంటూ అమ్మాయి వెనకాలే వచ్చాడు. అదును చూసి ఆమె చేతిలోని ఫోన్ లాక్కున్నాడు. తల మీద ఒక్కటిచ్చి వెళ్లిపోయాడు. అమ్మాయి ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టింది. దొంగను పట్టుకోవాలని అక్కడే ఉన్న యువకులను వేడుకుంది. వెంటనే ఇద్దరు యువకులు బైక్ మీద దొంగను వెంబడించారు. కొంత దూరం అతడి వెనకాలే వెళ్లారు. చివరకు అతడిని పట్టుకున్నారు. నాలుగు తన్ని.. ఫోన్ తీసుకున్నారు. ఆ దొంగను పట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి తీసుకొచ్చారు.
దొంగను చూసి అమ్మాయి షాక్!
తన దగ్గరికి తీసుకొచ్చిన దొంగను చూసి ఆ అమ్మాయి షాక్ అయ్యింది. అతడు తన బాయ్ ఫ్రెండ్ అని గుర్తించింది. వెంటనే అతడిని పట్టుకొచ్చిన యువకులు ఇతడు నీకు తెలుసా? అని అమ్మాయి అని అడుగుతారు. అతడు తన బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. దొంగ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని తెలిసి, వారు కూడా ఆశ్చర్యపోతారు. చెంప మీద లాగిపెట్టి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
View this post on Instagram
ఈ వీడియోను ‘hyderabad_merejaan’ అనే నెటిజన్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఎండింగ్ అస్సలు ఊహించలేం అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇప్పటికే సుమారు 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 461k లైకులు వచ్చాయి. పలువురు నెటిజన్లు ఈ వీడియో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అదరిపోయే కామెంట్లు పెట్టి నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. "దీదీ కా బాయ్‌ఫ్రెండ్ చోర్ హై" అని ఓ వ్యక్తి కామెంట్ చేస్తే.. “బ్రేకప్ లేకుండా మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్‌ని ఎలా చెక్ చేయాలి? దాన్ని దొంగిలించి చెక్ చేయండి” అని మరొకరు చమత్కరించారు. “ఆ బాయ్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటో?” అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే, ఈ వీడియో చూస్తే.. అది కావాలని రికార్డు చేసిన వీడియోలా అనిపిస్తోంది. వాస్తవంగా జరిగిన ఘటనలా అనిపించడం లేదు. మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు. మరి మీకు ఏం అనిపిస్తోంది?
Also read: పీరియడ్స్ వచ్చే ముందు రొమ్ముల్లో నొప్పి రావడం సహజమేనా?