అన్వేషించండి

Visakha Crime News: అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాన్ బోల్తా, బీర్ బాటిళ్ళ కోసం పోటీపడ్డ జనం

Visakha Crime News: అనకాపల్లి జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ మద్యం వ్యాన్ బోల్తా పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు మద్యం బాటిళ్ల కోసం పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. 

Visakha Crime News: ప్రమాదవశాత్తు ఓ మద్యం లారీ బోల్తా పడింది. ఇది తెలుసుకున్న స్థానిక ప్రజలు.. లారీ వద్దకు పరుగులు పెట్టారు. డ్రైవర్ ను కాపాడేందుకు కాదండోయ్.. మద్యం బాటిళ్లు తెచ్చుకోవడానికి. తండోపతండాలుగా తరలివచచ్చిన ప్రజలు.. అందినకాడికి కాటన్లను ఎత్తుకుపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

అసలేం జరిగిందంటే?

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై మద్యం లోడుతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు రహదారిపై బోల్తా పడింది. అనకాపల్లి మద్యం డిపో నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 200 కేసుల బీరు సీసాలు నేల పాలయ్యాయి. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానిక ప్రజలు ఎగబడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గతేడాది చేపల లారీ బోల్తా - పెద్ద ఎత్తున తరలివెళ్లిన ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తొలి రోజైన భోగితో ఏపీ ప్రజలు సంబురాలు జరుపుకుంటుండగా పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. చేపల లోడ్ లారీ దువ్వాడ నుండి నారాయణపురం వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. చేపల లోడుతో వస్తున్న లారీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కాలేజీ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు చనిపోయారు. లారీలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. లారీలో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ మద్యం మత్తు వల్లే లారీ బోల్తా పడి ప్రమాదం జరిగి ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

చేపల లోడ్ లారీ బోల్తా పడిన విషయం తెలియగానే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. చేపలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో చేపలను ట్రేలలో సర్దిస్తున్నారు. లారీ ఓనవర్ వివరాలపై క్షతగాత్రులను పోలీసులు ఆరా తీస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు లాంటి విషయాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget