అన్వేషించండి

Visakha Crime News: వెలుగులోకి పూర్ణానంద స్వామి ఆగడాలు, గతంలోనూ చాలా మందిని వేధించాడని కార్పొరేటర్ ఆరోపణలు

Visakha Crime News: 15 ఏళ్ల బాలికపై పూర్ణానంద స్వామి లైంగిక వేధింపులకు పాల్పడడం నిజమేనని కార్పొరేటర్ శ్రీవిద్య తెలిపారు. ఆయన గతంలోనూ చాలా మందిని వేధించారని వివరించారు.

Visakha Crime News: విశాఖపట్నం జిల్లాలోని వెంకోజీపాలెం జ్ఞాననంద ఆశ్రమం పూర్ణానంద స్వామిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వాస్తవమేనని స్థానిక 15 వ వార్డు కార్పొరేటర్ శ్రీ విద్య తెలిపారు. ఆయన ఉపాధ్యాయుడిగా పని చేసినప్పుడే పిల్లలను లైంగికంగా వేధించేవాడని గుర్తు చేశారు. స్వామిగా మారి పూర్ణానంద చేస్తున్న అరాచకాలు చాలా దారుణం అన్నారు. తన దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని శ్రీవిద్య వివరించారు. మైనర్ అమ్మాయిలను కంప్యూటర్ క్లాస్ అని తీసుకెళ్లి.. తాక రాని చోట తాకేవాడన్నారు. వాళ్లపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించే వారని పేర్కొన్నారు.. ఆశ్రమంలో కొంతమంది అబ్బాయిలు, ఓ మహిళ కలిసి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. గతంలో 100 మందిగా ఉన్న పిల్లలు... పూర్ణానంద పెట్టే టార్చర్ భరించలేక వెళ్లిపోయారని అన్నారు. మత గురువుల పేరిట ఇలా మైనర్లను లైంగికంగా హింసిస్తున్న వారిని కఠినంగా శిక్షిoచాలి కార్పొరేటర్ శ్రీ విద్య డిమాండ్ చేశారు. 

వెలుగులోకి ఇలా 

రాజమహేంద్రవరానికి చెందిన 15 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోయారు. దీంతో బంధువులు ఆ బాలికను ఐదో తరగతి వరకు చదివించి రెండేళ్ల క్రితం విశాఖలోని కొత్త వెంకోజీపాలెం వద్ద ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. అయితే ఆ ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ బాలికతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం వంటి పనులను చేయించేవారు. అర్ధరాత్రి అయ్యాక తనతో పాటు గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవారు. ఏడాది నుంచి బాలికను తన గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించి ఎదురు తిరిగితే కొట్టేవారు. కేవలం రెండు రెండు చెంచాల అన్నాన్ని నీటితో కలిపి మాత్రమే పెట్టేవారు. రెండు వారాలకు ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లాల్సి వచ్చేది. కాలకృత్యాలకు అనుమతించేవాడు కాదు. బకెట్ లోనే కానివ్వాల్సి పరిస్థితి. ఇలా గత రెండేళ్లుగా తీవ్ర వేధింపులకు గురి చేశారు. 

తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కి విజయవాడ చేరుకున్న బాలిక

అయితే ఈ విషయాన్ని గుర్తించిన పని మనిషి బాలికకు సాయం చేసి ఈ నరకం నుంచి బయట పడేసింది. ఈనెల 13వ తేదీన తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కగా.. తనకు పరిచయమైన ఓ ప్రయాణికురాలికి తన బాధను చెప్పుకుంది. ఆ మహిళ రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని హాస్టల్ లో చేర్చేందుకు ప్రయత్నించగా.. పోలీస్ స్టేషన్ నుంచి లేఖ తీసుకొస్తేనే అనుమతిస్తామని చెప్పడంతో వారు కంకిపాడు పీఎస్ కు వెళ్లారు. పోలీసులు ఇచ్చిన లేఖను తీసుకొని బాలల సంక్షేమ కమిటీకి బాలికను తీసుకెళ్లగా.. ఆశ్రమంలో అనుభవించిన నరకాన్ని వారికి బాలిక తెలిపింది. దీంతో సీడబ్ల్యూసీ సభ్యులను బాలికను విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్ కు పంపించగా పూర్ణానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విశాఖ పోలీసులు స్వామీజీని అరెస్ట్ చేశారు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget