అన్వేషించండి

US Colorado: 13 ఏళ్లకే తండ్రైన బాలుడు- 31 ఏళ్ల మహిళ చేసిన పనికి తలలు పట్టుకున్న న్యాయమూర్తులు!

US Colorado: 31 ఏళ్ల వయసు కల్గిన ఓ మహిళ 13 ఏళ్ల అబ్బాయిపై మనసు పడి వలపు వల విసిరింది. లైంగిక సంబంధం పెట్టుకుని గర్భం దాల్చింది. చివరకు ఏం జరిగిందంటే..?

US Colorado: 31 ఏళ్ల వయసు ఉన్న ఓ మహిళ 13 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడింది. ఎలాగైనా సరే అతడితో కోరిక తీర్చుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే బాలుడి వలపు వల విసిరింది. మాయ మాటలు చెప్పి దగ్గర చేసుకుంది. చాటుమాటుగా కలుస్తూ... లైంగిక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలుడిని కోరింది. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. చివరకు ఆమె గర్భం దాల్చడంతో గుట్టు రట్టయింది. 

అసలేం జరిగిందంటే..?

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో 31 ఏళ్ల వయసు ఉన్న సెరానో ఆండ్రియా అనే మహిళ స్థానికంగా ఉన్న 13 ఏళ్ల బాలుడిపై మనసు పడింది. ఈ క్రమంలోనే అతడికి మాయ మాటలు చెబుతూ లోబరుచుకుంది. తీరా గర్భం దాల్చాక విషయాన్ని అందరికీ చెప్పింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సెరానో ఆండ్రియాను అరెస్ట్ చేశారు. మైనర్ పై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు మోపారు. తమ మధ్య లైంగిక సంబంధం ఉన్న మాట వాస్తవమేనని కోర్టులో ఆండ్రియా అంగీకరించింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు.. సదరు బాలుడే తండ్రి అని చెప్పింది. అయితే ఏం చేయాలో పాలుపోని జడ్జిలు తలలు పట్టుకున్నారు.

మహిళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆమెను విడుదల చేయడానికి మొగ్గు చూపారు. 70 వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల 57 లక్షల రూపాలయల పూచీకత్తుతో విడుదలకు న్యాయమూర్తి ఆదేశించారు. ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో కేసును ముగించేందుకు కోర్టు ప్రయత్నించింది. పుట్టబోయే బిడ్డకు ఆ బాలుడినే తండ్రిగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

యూట్యూబ్ లో చూస్తూ కాన్పు చేసుకున్న బాలిక..! 

మహారాష్ట్రలోని నాగ్ పూర్ నగరం అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే నివాసం ఉంటోంది. అయితే ఆమెకు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది. తరచుగా వాళ్లిద్దరూ కలుస్తుండడంతో కొంత కాలం తర్వాత బాలిక గర్భం దాల్చింది. అయితే చాలా రోజుల పాటు బాలికకు ఆ విషయం తెలియలేదు. ఆమెకు తెలిశాక ఇంట్లో కూడా చెప్పకుండా మేనేజ్ చేయడం ప్రారంభించింది. ఓ దశలో పొట్ట పెద్దగా కనిపించడంతో తల్లి ప్రశ్నించగా... అనారోగ్యమే కారణం అంటూ ఏమార్చింది. ఆస్పత్రికి వెళ్దామన్నా అడ్డు చెప్తూ.. ఇంట్లోనే రోజులు వెళ్లదీసింది. ఈ క్రమంలోనే యూట్యూబ్ లో కాన్పు ఎలా చేసుకోవచ్చో చూసింది. 

ఈనెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆ పసిగుడ్డును గొంతునులిమి చంపేసింది. ఇంట్లోనే ఓ పెట్టెలో మృతదేహాన్ని దాచి పెట్టింది. పని మీద బయటకు వెళ్లిన తల్లి తరిగి వచ్చేసరికి బాలిక అనారోగ్య పరిస్థితుల్లో కనిపించింది. దీంతో తల్లి భయపడిపోయి ఏమైందని గట్టిగా నిలదీసింది. దీంతో బాలిక అసలు విషయాన్ని తెలిపింది. పెట్టెలో పెట్టిన చిన్నారి మృతదేహాన్ని కూడా చూపించింది. వెంటనే సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... బాలింతగా మారిన బాలికను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Varun Tej: కొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
కొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
Embed widget