Nellore Crime: బతుకుదెరువు కోసం యూపీ నుంచి నెల్లూరుకు భార్యాభర్తలు.. ఇంతలో ఘోరం, ఏమైందంటే..

యూపీనుంచి వచ్చిన ఓ జంట నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలంలో కాపురం ఉంటోంది. భర్త వేధింపులు ఎక్కువవడంతో భార్య చనిపోయింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

FOLLOW US: 

వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఉపాధి లేకపోవడంతో తెలిసిన వారి ద్వారా నెల్లూరుకి వచ్చారు. నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం ఆములూరు మిక్స్ డ్ కాలనీలో కాపురం పెట్టారు. భర్త పేరు రాహుల్, భార్య పేరు కిషన్ క్రాంతి. కొన్నాళ్లుగా అన్యోన్యంగా జీవితం సాగింది. అయితే అనుకోకుండా భర్త మద్యానికి బానిసవడం, తర్వాత గొడవలు ముదరడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. కానీ భర్త పైనే అందరి అనుమానం ఉంది. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. 

ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి నెల్లూరు జిల్లాలో స్థిరపడినవారు చాలామంది ఉంటారు. ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా చాలామంది నెల్లూరు జిల్లాకు వస్తుంటారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నూడిల్స్, లేదా పానీ పూరీ బండి పెట్టుకుని జీవనం కొనసాగిస్తుంటారు. అలాగే ఉత్తర ప్రదేశ్ జాలవాన్‌ జిల్లా, కోట్‌ వంత్‌ మండలం, పురావతరుచూర్‌ గ్రామానికి చెందిన రాహుల్‌, కిషన్‌ క్రాంతి దంపతులు నాలుగు నెలల క్రితం నెల్లూరు జిల్లాకు వచ్చారు. టీపీ గూడూరు మండలం విలుకాని పల్లిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. మిక్స్ డ్ కాలనీలో ఈ దంపతులు పానీ పూరీ బండి పెడుతుంటారు. ప్రతి రోజూ సాయంత్రం పానీ పూరీ బండి పెట్టి జీవనం సాగిస్తున్నారు. 

ఇటీవల రాహుల్ తాగుడికి బానిసైనట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో భార్యని కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడని స్థానికులు తెలిపారు. రెండు నెలలుగా భార్య ఇతని హింసల్ని భరిస్తూ వచ్చింది. చివరకు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటి యజమాని షబ్బీర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిషన్‌ క్రాంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పోలీసులు. భర్త కోసం గాలిస్తున్నారు. ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి ఈ కేసు విచారణ చేపట్టారు. 

హత్యా..? ఆత్మహత్యా..?
మద్యం మత్తులో భర్తే భార్యను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేపట్టారు. అసలేం జరిగిందనేది రాహుల్ మాత్రమే చెప్పగలడు అని అంటున్నారు. రాహుల్ నోరు విప్పితేనే  విషయం తేలుతుంది. ఉత్తర ప్రదేశ్ లో వారి బంధువులకు కూడా సమాచారం ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. 

Also Read: Nizamabad Crime News: కోడలి అక్రమ సంబంధం.. విషయం అత్తకు తెలిసింది.. ఏంటీ పని అంటూ నిలదీసింది.. చివరకు..

Also Read: Karimnagar Court: మీ-సేవ నుంచి ఈడ్చుకొచ్చి పట్టపగలే యువతి హత్య.. మూడేళ్లకు కోర్టు సంచలన తీర్పు, సర్వత్రా హర్షం

Also Read: Nellore Crime: ప్రేమతో కూర వండిన భార్య.. మొహం చిట్లించిన భర్త, ఆవేశంతో ఘోరానికి పాల్పడ్డ భార్య

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Jan 2022 11:10 AM (IST) Tags: Nellore news nellore police Nellore Update Nellore Crime nellore suicide tp gudur up woman death in nellore

సంబంధిత కథనాలు

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు