Stick in Private Part: పోలీసుల దుశ్చర్య! యువకుడి మలద్వారంలో కర్ర దూర్చిన కానిస్టేబుళ్లు - కరెంట్ షాక్ కూడా!
UP Police: ఈ ఘటన మే 2న జరిగింది. పోలీసు స్టేషన్ లోనే యువకుడిని విద్యుదాఘాతానికి గురి చేశారని బాధిత యువకుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అతని మల ద్వారంలో కర్ర కూడా చొప్పించారు.
![Stick in Private Part: పోలీసుల దుశ్చర్య! యువకుడి మలద్వారంలో కర్ర దూర్చిన కానిస్టేబుళ్లు - కరెంట్ షాక్ కూడా! UP Police electrocuted Youth and stick inserted in private part, 5 Police suspended Stick in Private Part: పోలీసుల దుశ్చర్య! యువకుడి మలద్వారంలో కర్ర దూర్చిన కానిస్టేబుళ్లు - కరెంట్ షాక్ కూడా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/06/f1fedd2d9ae4380abc73ffb3173d1bbc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UP Police Inserts Stick in Private Part Crime: ఉత్తరప్రదేశ్‌లోని బదౌయూ జిల్లాలో పోలీసుల క్రూరత్వాన్ని చాటే ఉదంతం వెలుగులోకి వచ్చింది. గోహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ (Third Degree) ప్రయోగించి టార్చర్ పెట్టారు. ఈ ఘటన మే 2న జరిగింది. పోలీసు పోస్ట్‌లోనే యువకుడిని విద్యుదాఘాతానికి (Current Shock) గురి చేశారని బాధిత యువకుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అతని మల ద్వారంలో కర్ర కూడా (Stick in Private Part) చొప్పించారు. యువకుడి పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చేర్పించేంత వరకూ పోలీసులు అతణ్ని కొట్టారని ఆరోపించారు. ఈ కేసులో స్టేషన్ ఇన్‌చార్జి సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అలాగే అందరిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మే 2న, బదౌయూలోని కక్రాలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న యూనిస్ అలీ కుమారుడు రెహాన్‌ను పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ లో బంధించారు. రెహాన్ కూలి డబ్బుతో తిరిగి వస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. రెహాన్ బైక్ చోరీకి పాల్పడ్డాడు. పోలీసు పోస్ట్‌లోనే అతనిపై పోలీసులు సత్యపాల్ సింగ్, కానిస్టేబుళ్లు నరేంద్ర శేఖర్, జావ్లా, సోను, విపిన్ దాడి చేశారని ఆరోపించారు.
పోలీస్ స్టేషన్ లోపలే విద్యుత్ షాక్ (Current Shock) ఇచ్చారని, ఓ కర్రను ప్రైవేట్ పార్ట్‌లో (Stick in Private Part) పెట్టారని బంధువులు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రెహాన్ పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం రెహాన్ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెహాన్‌ను విడుదల చేసేందుకు పోలీసులు రూ.5 వేలు లంచం కూడా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read: హైదరాబాద్‌లో మరో దారుణం, అందరూ చూస్తుండగానే యువకుడి దారుణ హత్య - అసలేం జరిగిందంటే !
విషయం తెలియగానే ఏఎస్పీ ఓపీ సింగ్ కేసు దర్యాప్తును డేటాగంజ్ సీఓ ప్రేమ్ కుమార్ థాపాకు అప్పగించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేశారు. నిందితులందరిపైనా కేసు నమోదు చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు నగర ఎస్పీ ప్రవీణ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అవుట్ పోస్టు ఇన్‌చార్జి సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ (UP Police Suspend) చేశారు. తదుపరి చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)