UP Crime News: భర్తను ముక్కలు చేసి డ్రమ్ములో సిమెంట్ పోసేసింది - వదిలించుకోవాలంటే ఇంత ఘోరంగానా?
UP murder: భార్య అంటే ప్రాణంగా చూసుకుంటుందని అనుకుంటారు కానీ.. ఆ భార్య ప్రాణం తీసుకుంది. అది కూడా బాబోయ్ ఇలానా అని అందరూ భయపడేలా!

Wife Murder Husband: ఉత్తరప్రదేశ్‌లోని మీటర్‌లో సౌరభ్ రాజ్ పుత్ అనే మర్చంట్ నేవీ ఉద్యోగి అదృశ్యమయ్యారు. మర్చంట్ నేవీ కావడంతో కొన్ని నెలల పాటు సముద్రంలో విధులు నిర్వహించి ఇంటికి వస్తూంటారు. అలా విధులు ముగించుకుని ఈ నెల నాలుగోతేదీన మీరట్ లోని ఇంటికి వచ్చాడు. కానీ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఆయన ఉద్యగ సహచరులు, కుటుంబసభ్యులు వెదికి వెదికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మర్చంట్ నేవీ ఉద్యోగి మిస్సింగ్ ఘటన విషాదాంతం
మిస్సయింది మర్చంట్ నేవీ ఉద్యోగి కావడంతో పోలీసులు సీరియస్ గా సెర్చ్ చేశారు. కానీ ఎక్కడా ఆచూకీ దొరకలేదు. చివరికి కుటుంబ అంశాలపై కూపీ లాగారు. చివరికి భార్యపైనే అనుమానం వచ్చింది. దాంతో ఇంట్లో అణువు అణువు గాలించారు. కానీ ఎక్కడా అనుమానాస్పదంగా కనిపించలేదు.చివరికి ఇంటి ఆవరణలో ఓ మూల పడేసిన డ్రమ్మును గుర్తించారు. దాన్ని సిమెంట్,కంకర మిశ్రమంతో నింపేసి ఉన్నారు. ఎవరైనా నీళ్లు పట్టుకుంటారు.. పగిలిపోతే మొక్కలు పెట్టుకోవాలనుకుంటే మట్టిపోస్తారు.సిమెంట్ , కంకర మిక్సింగ్ పోసి దిమ్మలా ఎందుకు చేశారో అర్థం కాలేదు. దానిపై సౌరభ్ రాజ్ పుత్ భార్య ముస్కాన్ ను అడిగితే కంగారు పడ్డారు. దాంతో పోలీసులు ఏదో ఉందని అంచనా వేసి.. దాన్ని పగులగొట్టారు. అంతే.. సౌరభ్ రాజ్ పుత్ మిస్సింగ్ మిస్టరీ వీడిపోయింది.
వివాహేతర బంధం కారణంగా భర్తను ముక్కులుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్ పోసిన భార్య
ఆ డ్రమ్ములోనే సౌరభ్ రాజ్ పుత్ శరీర భాగాలను వేసి సిమెంట్ , కంకర మిశ్రమాన్ని పోసి పెట్టారు. అలా చేయడం వల్ల మృతదేహం నుంచి వాసన కూడా రాదని ప్లాన్ తో అలా చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సౌరభ్ భార్య ముస్కాన్ నేరాన్ని ఆంగీకరించింది. ఆమె వివాహేతర బంధం పెట్టుకున్న సాహిల్ అనే వ్యక్తితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లుగా అంగీకరించింది. పోలీసులు వెంటనే సాహిల్ ను అరెస్టు చేశారు.
హత్య తర్వాత ప్రియుడితో కలిసి విహారయాత్ర
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంగానే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మార్చి నాలుగో తేదీన డ్యూటీ నుంచి వచ్చిన సౌరభ్ ను అదే రోజు కత్తితో పొడిచి చంపేసి ...ముక్కలు చేసి డ్రమ్ములో వేశారు సిమెండ్, కంకర మిశ్రమాన్ని కలిపారు. సౌరభ్ ఎక్కడికో వెళ్లిపోయాడని పోలీసుల్ని నమ్మించేందుకు సౌరభ్ ఫోను నుంచి తల్లిదండ్రులకు ఇతర స్నేహితులకు.. రెండు, మూడు రోజుల పాటు మెసెజులు పంపింది ముస్కాన్. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి ఓ హిల్ స్టేషన్ కు విహారయాత్రకు కూడా వెళ్లింది.
ఈ హత్య ఘటన మీరట్ లోనే కాదు..దేశవ్యాప్తంగా కలకలం రేపింది.





















