అన్వేషించండి

UP Man Killed By Lover: ఇద్దరు భార్యలు 18 మంది పిల్లలున్నా వివాహేతర బంధం - అదే ప్రాణం తీసింది !

UP Man Murder: ఆయనకు ఇద్దరు భార్యలు, 18 మంది పిల్లలు. ఆయినా మరో లవర్‌ను మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. చివరికి ఆమె చేతిలో చనిపోయాడు. ఈ ఘటన యూపీలో జరిగింది.

UP Man With 18 Children From 2 Wives Killed By Lover: ఉత్తరప్రదేశ్‌లోని  బహ్రైచ్  జిల్లా, ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌండి గ్రామానికి చెందిన నసీమ్  అనే వ్యక్తి జీవితం అత్యంత విచిత్రంగా ముగిసింది. నసీమ్‌కు ఇద్దరు భార్యలు, ఏకంగా 18 మంది పిల్లలు ఉన్నారు. అయితే, ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ, అదే గ్రామానికి చెందిన సల్మా అనే మహిళతో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే నసీమ్ అదృశ్యం కావడం, ఆపై ఒక గోనె సంచిలో అతని మృతదేహం లభ్యం కావడంతో ఈ మిస్టరీ వెలుగులోకి వచ్చింది.        

ఇద్దరు భార్యలున్నా.. సరిపోక మరో మహిళతో వివాహేతర బంధం 

నసీమ్ తన ప్రియురాలు సల్మా ఇంటికి తరచుగా వెళ్లేవాడు. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఆర్థిక విషయాల్లో లేదా వ్యక్తిగత కారణాలతో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నసీమ్‌ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న సల్మా, అత్యంత కిరాతకమైన ప్లాన్ వేసింది. తన ఇంటికి వచ్చిన నసీమ్‌ను గొంతు నులిమి హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేసింది.                

నసీమ్ కనిపించకపోవడంతో ఆందోళనతో ఇద్దరు భార్యల ఫిర్యాదు               

నసీమ్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సమీపంలోని పొలాల్లో దుర్వాసన వస్తున్న ఒక గోనె సంచిని గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న నసీమ్ మృతదేహం బయటపడింది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణ ఆధారంగా పోలీసులు సల్మాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.                                                    

హత్యకు కారణాలపై పోలీసుల ఆరా!                                

ఈ హత్యలో సల్మాకు మరో వ్యక్తి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగిందా లేక దీని వెనుక ఏదైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 18 మంది పిల్లలకు తండ్రి అయిన వ్యక్తి ఇలా అక్రమ సంబంధం మోజులో ప్రాణాలు కోల్పోవడం ఆ గ్రామంలో విషాదాన్ని, చర్చను రేకెత్తించింది. ప్రస్తుతం నిందితురాలు సల్మాను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.                           

    

టాప్ హెడ్ లైన్స్

Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
IIIT Student Commits Suicide: ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
Agra Bathroom Murder Case: ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం! 
ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం! 
LPG Tanker Explosion: టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget