Fight With Wife: భార్యతో గొడవపడిన భర్త - కొట్టి చంపేసిన బామ్మర్దులు- ఇదెక్కడి ఘోరం?
UP Man Murder: యూపీలో ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడ్డారు. ఆ భార్య సోదరులు వచ్చి ఆ బావను రోడ్డు మీదకు తన్నుకుంటూ తీసుకెళ్లి హత్య చేసేశారు.

UP Man Beaten To Death By In-Laws After Fight With Wife: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా ఇమ్తౌరి గ్రామంలో భార్యభర్తల గొడవ చివరికి హత్యకు దారి తీసింది. 35 ఏళ్ల సోను కుమార్ తన భార్యతో గొడవపడ్డాడు. ఈ విషయం బావమరుదులుకు తెలియడంతో వారు వచ్చి బావ సోనుకుమార్ ను హైవేపై పరుగెత్తించి కొట్టారు. విషం తాగించి హత్య చేశారు. సోను తల్లి సుఖ్వీరి దేవి ఫిర్యాదు మేరకు ఏడుగురిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 103 ( హత్య ), 115 కింద కేసు నమోదు చేశారు.
సోను, హాపూర్‌లో షాప్‌కీపర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. నవంబర్ 2024లో బులంద్‌షహర్ మంచిపూర్ గ్రామానికి చెందిన సంతోషితో వివాహం అయింది. ఆ తర్వాత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. బుధవారం భోజనం విషయంపై మళ్లీ గొడవ ఏర్పడటంతో, సంతోషి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏడ్చింది. వెంటనే ఆమె తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు గ్రామానికి చేరుకుని సోనుపై దాడి చేశారు. చేతికి దొరికిన కర్రలు, రాడ్‌లతో కొట్టారు. సోను తప్పించుకుని హైవే మీదకు పరిగెత్తినా, వారు వేటాడి మళ్లీ కొట్టారు. తర్వాత బలవంతంగా విషం తాగించి, రోడ్డు మీదే వదిలేసి పారిపోయారు.
👉🏼 Follow @LogicalIndians
— The Logical Indian (@LogicalIndians) October 4, 2025
Hapur Man Sonu’s Tragic Death: Chased, Beaten, and Poisoned by In-Laws After Domestic Fight, Seven Accused Fugitive.#HapurMurder #DomesticViolence #JusticeForSonu #StopFamilyViolence #UPCrimehttps://t.co/vbpA87lJWq
స్థానికులు, సోను కుటుంబ సభ్యులు అతన్ని హాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో సోనును మీరట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సోను తల్లి సుఖ్వీరి దేవి ఫిర్యాదులో తమ ఆస్తులన్నీ సంతోషి కుటుంబసభ్యులు రాయించుకున్నారని ఇప్పుడు విషం తాగించి చంపేశారు" అని ఆరోపించింది.
On Wednesday morning, Sonu and his wife, a couple living in Uttar Pradesh's Hapur, had a fight. Following this, the woman informed her parents about the incident and called the family from Bulandshahr.
— ForMenIndia (@ForMenIndia_) October 3, 2025
The woman's family allegedly assaulted Sonu, and when he tried to escape,… pic.twitter.com/i07gbCie2J
సంతోషి తల్లిదండ్రులు సహా ఏడుగురిపై హత్య కేసు పెట్టారు. ఈ దాడి CCTVలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో, సోనును కర్రతో కొడుతూ వేటాడుతున్న దృశ్యాలు ఉన్నాయి వైరల్ క్లిప్‌లో సోను "నా భార్య సోదరులు విషం తాగించారు" అని చెప్పే వీడియోలు వైరల్ అయ్యాయి.





















