Crime News: పెళ్లైన మహిళని గర్భవతిని చేసిన పరాయి వ్యక్తి, ఫ్రెండ్స్‌తో కలిసి హత్య - అసలేం జరిగిందంటే?
UP Crime News: పైళ్లె విడాకులు తీసుకున్న మహిళలతో ప్రేమాయణం నడిపాడు. గర్భవతిని చేసి మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో కడుపుతో ఉండగానే దారుణంగా హత్య చేశాడో ప్రియుడు.
UP Crime News: కూతురు వయసుకు రావడంతో ఆ అమ్మానాన్నలు ఎంతో కష్టపడి పెళ్లి చేశారు. ఓ అయ్య చేతిలో పెట్టి సంతోషంగా ఉండమని దీవించారు. కానీ పెళ్లైన తర్వాత దంపతుల మధ్య తరచూ గొడవలు వచ్చాయి. దీంతో భరించలేని ఆమె.. పెళ్లైన ఏడాదికే పుట్టింటికి వచ్చేసింది. ఏదో ఒక పని చేసుకుంటూ తల్లిదండ్రులతోనే కలిసి జీవిస్తోంది. ఈక్రమంలోనే ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. అదికాస్తా ప్రేమగా మారింది. శారీరక సంబంధానికి కూడా దారి తీసింది. తమకు నచ్చినప్పుడల్లా కలవడంతో.. మహిళ గర్భం దాల్చింది. ఇక అప్పటి నుంచి అతడు మొహం చాటేయడం ప్రారంభించాడు. కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని మహిళ అతడిపై ఒత్తిడి తేగా స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేశాడు. కడుపుతో ఉందని కూడా కూడా చూడకుండా పెద్ద బండ రాయితో మోది చంపాడు.
అసలేం జరిగిందంటే..?
ఉత్తర్ ప్రదేశ్ లోని మేరట్ జిల్లాకు చెందిన ఓ మహిళకు 2015లో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అయితే అత్తారింట్లోని కుటుంబ సభ్యులతో పాటు భర్తతో కూడా తరచూ గొడవలు జరుగుతుండడంతో వివాహం జరిగిన ఏడాదికే పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులతో కలిసే జీవిస్తోంది. ఈక్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన ఆదేశ్ అనే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారగా.. గత మూడేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. శారీరకంగానూ కలవడంతో.. ఫలితంగా మహిళ గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పి పెళ్లి చేసుకోమని కోరగా.. అతడు అందుకు ఒప్పుకోలేదు. అది చాలదన్నట్లు ఆమెను తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవడం ఇష్టం లేక, ప్రేమించిన వాడిని వదులుకోలేక... అతడిపై ఒత్తిడి చేసింది. కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టింది.
నలుగురు స్నేహితులతో కలిసి హత్యకు ప్లాన్..
అయితే ఆమెను పెళ్లి చేసుకోవడం అస్సలే ఇష్టం లేని ఆదేశ్.. ఎలాగైనా సరే ఆమె అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. చంపాలని పథకం పన్నాడు. తన నలుగురు స్నేహితులు దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్ లతో కలిసి ప్లాన్ కూడా వేశాడు. ఓసారి మాట్లాడాలి రమ్మంటూ మహిళను తన ఇంటి వద్దకు పిలిపించుకున్నాడు. ఆమె రాగానే తన స్నేహితుల సాయంతో పెద్ద బండ రాయితో మోది ఆమెను హత్య చేశాడు. తలకు తీవ్రమైన గాయం అవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తీవ్రంగా భయపడిపోయిన నిందితులు ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు.
అయితే మూడ్రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని కూతురు మృతదేహం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తులో.. స్నేహితుల సాయంతో ఆదేశ్ యే మహిళను హత్య చేసినట్లు గుర్తించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. మృతురాలి కడుపుతో ఉందని తెలియడంతో స్థానికులంతా కంటతడి పెట్టుకున్నారు. అమ్మాయితో తిరిగి ఇలా దారుణంగా హత్య చేయడం పాపం అంటూ చెప్పుకొచ్చారు.