అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Warangal: గుప్త నిధులు అని చెప్పి రూ.15 లక్షలు దోచేశారు, బాధితురాలి ఫిర్యాదుతో ముఠా అరెస్ట్

Gupta Nidhulu Telugu News: గుప్త నిధుల పేరుతో కొందరు ముఠాగా ఏర్పడి ఓ కుటుంబాన్ని నిండా ముంచేశారు. పూజల పేరుతో లక్షలకు లక్షలు గుంజారు. మోసపోయామని గ్రహించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

వరంగల్..

వరంగల్: గుప్తనిధుల పేరుతో ఓ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసి రూ.15 లక్షలు వసూలు చేసిన గుప్త నిధులు ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీస్ లు అరెస్ట్ చేశారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసి గుప్తనిధుల ముఠాను అరెస్ట్ చేసి ఇద్దరు నిందితుల నుండి 15 లక్షలు, 540 గ్రాముల వెండి బిళ్ళలు, 76 బంగారు రేకు బిళ్ళలు, రెండు కార్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నట్లు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ చెప్పారు. మరో ఇద్దరు నిదితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నలుగురు చనిపోయారు, గుప్త నిధులే కారణం 
జనగామ జిల్లా కొడకండ్ల కి చెందిన ఒక బాధితురాలు వివరాల ప్రకారం.. మూడు నెలల కిందట బాధితురాలు అత్తకు సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి రజనీకాంత్ కలిశారు. ఆమె వద్దకు వచ్చి మీ కుటుంబం సమస్యలతో బాధపడుతున్నారని మీ ఇంట్లో నలుగురు చనిపోయారని చెప్పినట్లు డీసీపీ చెప్పారు. మీ ఇంట్లో నలుగురు చనిపోయారు అని చెప్పేసరికి అత్త, కోడలు అతని మాటలు నమ్మారు. రజినీకాంత్ ను ఇంటికి తీసుకెళ్లి చూపెట్టగా ఇంట్లో గుప్తనిధి ఉందని దానివల్లనే నలుగురు చనిపోయారని డీసీపీ తెలిపారు. ఆ గుప్త నిధులను బయటకు తీయకపోతే మిగితా కుటుంబ సభ్యులు చనిపోతారని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఏం చేయాలని అడగ్గా మీ ఇంట్లో ఉన్న గుప్త నిధులను బయటకు తీయాలని ఒక పూజ చేయాలన్నారు.

Warangal: గుప్త నిధులు అని చెప్పి రూ.15 లక్షలు దోచేశారు, బాధితురాలి ఫిర్యాదుతో ముఠా అరెస్ట్

పూజ సామాగ్రి పేరుతోనూ మోసాలే 
ఆ పూజ చేయడానికి ముందు అంజనం కోసం యాదగిరిగుట్ట లోని ఓ షాప్ కి వెళ్లి ఒక పౌడర్ తీసురావాలని చెప్పారు. బాధితురాలు యాదగిరిగుట్టలో 1 లక్ష 75 వేలు చెల్లించి పౌడర్ తీసుకొని వచ్చారు. పౌడర్ తీసుకువచ్చామని సమాచారం అందించినట్లు సమాచారం ఇవ్వడంతో  ఆ ముఠా సభ్యులు నరసింహ, మోటం సురేష్ లు ఇంటికి వచ్చి గుప్త నిధులు తేవడానికి పూజా సామాను కోసం 9 లక్ష 20 వేలు ఖర్చు అవుతుందని చెప్పినట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. ఆ డబ్బు తీసుకొని వేములవాడలోని విఘ్నేశ్వర పూజ స్టోర్ లో పూజ సామాను తీసుకురాగా పూజ చేశారని డీసీపీ చెప్పారు. పూజ పూర్తి అయిన తరువాత 15 రోజుల తరువాత మరో పూజ చేయాలని అందుకు 14 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినట్లు డీసీపీ తెలిపారు.

Warangal: గుప్త నిధులు అని చెప్పి రూ.15 లక్షలు దోచేశారు, బాధితురాలి ఫిర్యాదుతో ముఠా అరెస్ట్

కరీంనగర్ లోని శ్రీ రాజరాజేశ్వర పూజ షాప్ లో రూ.7 లక్షలు చెల్లించి, మిగతా ఏడు లక్షలు చెల్లిస్తే పూజా సామాన్లు తీసుకొస్తామని ముఠా అభ్యులు చెప్పినట్లు డీసీపీ తెలిపారు. ముందు పూజ చేయండి తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఈరోజు కొడకండ్ల గ్రామానికి పూజ సామాన్ తో పాటు నరసింహ పూజ చేయడం కోసం వచ్చారు. పోలీసుల ముందస్తు ప్రణాళికతో ముఠా సభ్యుడు నరసింహను  కొడకండ్ల పోలీస్ లు పట్టుకొని విచారించగా జరిగిన ప్లాన్ ను చేసినట్లు డీ సీపీ చెప్పారు. మిగతా నిందితులు కడమంచి రజనీకాంత్, మోటాం సురేష్ లు ఇద్దరూ పెద్దూరు గ్రామం సిరిసిల్ల మండలం జిల్లా కి చెందినవారు పరారీలో ఉన్నారని రాజమహేంద్ర నాయక్ చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget