అన్వేషించండి

Tirupati News : తిరుమలకు మద్యం అక్రమ రవాణా, కారులో 16 మద్యం సీసాలు పట్టివేత!

Tirupati News : తిరుమలలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. కానీ కొందరు అక్రమంగా తిరుమలకు మద్యం రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు మద్యం తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు.

Tirupati News : తిరుమలలో మద్యపాన నిషేధం అమలులో ఉందని తిరుమల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ తిరుమలయ్య తెలిపారు. తిరుమలలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. జీఎన్సీ టోల్ గేట్ వద్ద వైట్ స్విఫ్ట్ కారులో మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. వాహనంలో 16 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసామన్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న తిరుమలకి చెందిన పీఎన్ రమేష్  అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. స్థానిక బాలాజీనగర్ లో ఉంటూ మద్యం బాటిల్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం మేరకు నిఘా ఉంచామన్నారు. తిరుమలలో మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధించడం ఉందని, మత్తు పదార్థాలు సేవించిన, విక్రయించిన కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

16 మద్యం సీసాలు స్వాధీనం 

" తిరుమలలో మద్యం అక్రమ రవాణా, అమ్మకాలపై సమాచారంతో తనిఖీలు చేశాం. ఈ తనిఖీల్లో మారుతీ షిప్ట్ కారులో 16 మద్యం బాటిల్స్ గుర్తించాం. తిరుపతి నుంచి తిరుమలకు వీటిని తీసుకెళ్తున్నట్లు గుర్తించాం. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. పీఎన్ రమేష్ అనే నిందితుడు చాలా రోజులుగా మద్యం రవాణా చేస్తున్నట్లు తేలింది. "
--తిరుమలయ్య, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ
 

తిరుమలలో కొత్త దందా! 

తిరుమల శ్రీవారి దర్శనానికి కరోనా తర్వాత భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని, ఈ తరుణంలో ఆచరణ సాధ్యం కానీ నిర్ణయాలను టీటీడీ తీసుకుని భక్తులకు ఇబ్బందులకు గురి చేస్తుందని తిరుపతి జనసేన నాయకులు కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుమల కొండపై భక్తులకు అవసరం అయ్యే వివిధ రకాల వస్తువులను ఆయన మీడియాకు చూపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్న పిల్లలు పాల సీసాలు, వాటర్ బాటిల్స్ లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది బలవంతంగా అలిపిరి వద్ద లాక్కుంటున్నారని ఆరోపించారు. తిరుమలలో గాజు బాటిల్స్ యాభై రూపాయలకు విక్రయిస్తూ భక్తులను నిలువునా దోచుకుంటున్నారని చెప్పారు. తిరుమలలో‌ నీళ్ల ధర దాదాపుగా ఇతర ప్రాంతాల్లో బియ్యం ధరతో సమానం అయ్యిందని ఆయన వివరించారు. తిరుమలలో ఇద్దరు వైసీపీ నాయకులు నీటిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఉందని, ప్లాస్టిక్ లేని వస్తువులను తిరుమలకు తీసుకుని రావాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానానిదే అని ఆయన గుర్తు చేశారు. ఇవి ప్రశ్నిస్తే తమపై కేసులు, నిఘా పెడుతున్నారని, త్వరలో టీటీడీ ఈవోను కలిసి భక్తుల సమస్యపై చర్చించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ కోరారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget