అన్వేషించండి

Tirumala News : తిరుమలలో తెలంగాణ అటవీ అధికారి గుండెపోటుతో మృతి!

Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు.

Tirumala News : శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తూ భక్తుడికి గుండెపోటుకు గురయ్యాడు. భక్తుడిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. భక్తుడు కరీంనగర్ జిల్లాకు చెందిన ఫారెస్ట్ అధికారి సాయిప్రసాద్ గా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భక్తుడి మృత దేహాన్ని శవ పరీక్షల కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. సాయి ప్రసాద్ కోరుట్ల పట్టణంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ డిప్యూటీ రేంజ్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకు ఏడేళ్ల వయసులో ఉన్న కొడుకు, ఐదేళ్ల వయసు ఉన్న పాప ఉన్నారు. ఇటీవల నూతన జోనల్ విధానంలో భాగంగా ఆయన మహదేవపూర్ కు బదిలీ అయ్యారు. గతంలో వేములవాడ సమీపంలోని రుద్రంగిలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేశారు.  

తెలంగాణలో అటవీ శాఖ సిబ్బంది ఆందోళన 

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్య అటవీసిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది. అందుకే తమకు ఆయుధాలు సమకూర్చాలన్న డిమాండ్‌ను సిబ్బంది గట్టిగా వినిపిస్తున్నారు. లేకుంటే తాము విధులు నిర్వర్తించలేమంటున్నారు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ ఇన్ని రోజులు గట్టిగా నినదించలేకపోయారు. తమ సహచరుడు ప్రాణాలు కోల్పోయినందున  ఇప్పుడు ఆ డిమాండ్‌పై గట్టిగా పట్టుబడుతున్నారు అటవీ సిబ్బంది.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటవీ సిబ్బంది నిరసనలు మిన్నంటాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి ఖమ్మంలో విధులకు హాజరయ్యారు ఫారెస్ట్ సిబ్బంది. శ్రీనివాసరావు హత్యను నిరసిస్తూ శాంతి ర్యాలీ చేశారు. ఫారెస్ట్ అధికారులకు ఆయుధాలు సమకూర్చి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఫారెస్ట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ములుగు జిల్లా కేంద్రంలో అటవీశాఖ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఆత్మరక్షణలో భాగంగా తమకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుత్తి కోయ గూడాలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఫారెస్ట్ సిబ్బంది. గుత్తికోయల దాడిలో మృతి చెందిన FRO శ్రీనివాసరావుకు నివాళులు అర్పిస్తూ శాంతి ర్యాలీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులు ఆందోళనకు దిగారు. పోడు సర్వే, గ్రామసభల విధులను బహిష్కరించారు.  తమకు ఆయుధాలు ఇస్తేనే విధులకు హాజరవుతామని తేల్చిచెప్పారు. ఖమ్మం ఘటనతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పారు అటవీశాఖ అధికారులు.  

ఫారెస్ట్ రేంజ్ అధికారి హత్య 

గుత్తి కోయలు అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ శ్రీనివాసరావును గుత్తి కోయలు గొడ్డలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అధికారిని చికిత్స నిమిత్తం ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుకు రిటైర్‌మెంట్ వరకు జీతభత్యాలు ప్రభుత్వం ఎలా అందిస్తుందో అదే విధంగా ఆయన కుటుంబానికి వేతనాన్ని అందించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం కేసీఆర్. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అధికారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా వెంటనే అందజేయాలని ఆదేశించారు కేసీఆర్. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తుందన్న సీఎం... అలాంటి వారిని సహించబోమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తామన్నారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget