Tirumala Crime News: తిరుమలలో గంజాయి అక్రమ రవాణా కలకలం - కాంట్రాక్టు ఉద్యోగి అరెస్ట్
Tirumala Crime News: తిరుమలలో గంజాయి అక్రమ రవాణా బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. తిరుపతి, తిరుమలలో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
Tirumala Crime News: తిరుమలలో గంజాయి అక్రమ రవాణా కలకలం రేపుతుంది. దీంతో అప్రమత్తంమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు నిషేధిత వస్తువులు తరలిస్తున్నారని రాబడిన రహస్య సమాచారంతో తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దీంతో లక్ష్మీ శ్రీనివాసం కార్పోరేషన్ సంస్థ తరపున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న గంగాధరంను టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి సుమారు 125 గ్రాముల బరువు గల చిన్న చిన్న గంజాయి ఫ్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే తిరుపతి, తిరుమలకు తరచూ అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు విచారణ నిమిత్తం తిరుమల ఎస్ఈబి పోలీసులకు అప్పగించారు.
ఇటీవలే కూరగాయల వాహనంలో గంజాయి తరలింపు - ఇద్దరి అరెస్ట్
గత కొంత కాలంగా తిరుమలకు అక్రమంగా నిషేధిత వస్తువులు తరలిస్తున్న సమాచారంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు, జిఎన్సీ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే టీటీడీ క్వార్టర్స్ వద్ద కూలీల వద్ద నుండి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇటీవలే తిరుమలలో కూరగాయల వాహనంలో గంజాయిని తరలిస్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం టీటీడీ విజిలెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కూరగాయల వాహనంలో దాదాపు అర కేజీ గంజాయిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో వాహనంలో ఉన్న రెడ్డి, రెహమాన్ అనే ఇద్దరు యువకులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే తిరుమలలోని హోటల్స్, దుకాణాలకు నిత్యం కూరగాయలు తరలిస్తుంటారు. కూరగాయల మాటున కొద్ది కాలంగా గంజాయి తరలిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు గంజాయిని కొండపై ఎవరి అందిస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం బాటిళ్లు సీజ్
తిరుమలలో ఇటీవల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు సెబ్ అధికారులు. తిరుమల ఓల్డ్ బార్బర్ క్వార్టర్స్ వద్ద 22 మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది. మద్యం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. నిందితులు సుమలత, నాగేంద్ర ప్రసాద్, బిన్నీ, ప్రవీణ్ కుమార్ వద్ద నుంచి మొత్తం 22 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీళ్లంతా అనంతపురం జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కాంట్రాక్టు పనుల కోసం తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది.
తిరుమలలో మాంసం తింటూ పట్టుబడ్డ షికారీలు!
తిరుమలలో ఇటీవల మాంసం తింటూ షికారీలు పట్టుబడ్డారు. వారిని తిరుమల విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో మద్యమాంసాలపై నిషేధం ఉన్నా కొందరు మాత్రం నియమాలను అతిక్రమిస్తున్నారు. నిబంధనలు పాటించే వారికేనని మాకు కాదంటూ కొందరు షికారీలు, స్థానికులు తరచూ తిరుమలలో మాసం మద్యం సేవిస్తూ పట్టుబడుతున్నారు. తిరుమలలోని షికారి వీధిలో కొందరు షికారీలు మాసం వండినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన విజిలెన్స్ సిబ్బంది ఇద్దరు షికారిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించి విచారణ చేపట్టారు. తిరుమల కొండపై మద్యం, మాంసంపై నిషేధం ఉంది. కొందరు ఈ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. తిరుమలలో మాంసం తింటూ మద్యం సేవిస్తూ పట్టుబడుతున్నారు. తిరుమలలోని షికారీ వీధిలో కొందరు షికారీలు మాంసం వండి తింటున్నట్టు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.