ఆదిలాబాద్ జిల్లాలో కలకలం- ఒకే రోజు రెండు ఆటో షోరూమ్‌లలో చోరీలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రాత్రి రెండు షోరూంలలో చోరీలకు పాల్పడ్డారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకేరోజు రాత్రిపూట రెండు చోట్ల సిని ఫక్కిలో దొంగతనాలకి పాల్పడ్డారు దొంగలు. రెండు షోరూంలలోను దొంగతనాలకు పాల్పడి హల్ చల్ సృష్టించారు. మావల సుజూకి షోరూంలో వాచ్‌మెన్‌ను గన్‌తో బెదిరించి లాకర్ తో ఉడాయించారు.
ఆదిలాబాద్ జిల్లాలో సినీ ఫక్కీలో జరిగిన దొంగతనం కలకలం రేపుతోంది. మావల మండలం కేంద్రంలోని మారుతి సుజుకి షోరూంలో గత రాత్రి నలుగురు దుండగులు తుపాకీతో బెదిరించి, వాచ్ మెన్‌ను బాత్రూంలో బంధించిన దుండగులు.. షోరూం లోని లాకర్‌ను ఎత్తుకెళ్లారు. అందులో సుమారుగా 3 లక్షల రూపాయలు ఉన్నాయని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు.
నిర్మల్ జిల్లాలోని హోండా షోరూంలోను దుండగులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. అంతరాష్ట్ర దొంగల ముఠా అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ దొంగల కోసం ప్రత్యేక పోలిస్ టీమ్‌లను రంగంలోకి దింపారు. ఒకే రోజు వరుసగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో జరిగిన దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.