Viral News: యజమానిపై దాడి చేసి మర్మాంగాలు కొరికి తిన్న కుక్క, తెల్లారేసరికి విషాదం.. హైదరాబాద్‌లో ఘటన
Hyderabad News | అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై అతడి పెంపుడు కుక్క దాడి చేసి మర్మాంగాలు కొరికి తినడంతో వ్యక్తి మృతిచెందాడు. హైదరాబాద్ లోని మధురానగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Man Dies with Dog attack In Hyderabad | శునకాలు విశ్వాసానికి మారుపేరుగా ఉంటాయి. ఎవరైనా మనల్ని నమ్మించి మోసం చేస్తే.. కుక్కకున్న విశ్వాసం కూడా లేదని అంటుంటాం. కానీ హైదరాబాదులో జరిగిన ఓ సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పెంపుడు కుక్క దాడిచేసి కరవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లాకి చెందిన డి పవన్ కుమార్ (37) తన స్నేహితుడు సందీప్ కలిసి ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. విరుగత ఐదేళ్లుగా మధురానగర్ లోనే ఉంటున్నారు. పవన్ కుమార్ ప్రైవేట్ ఆఫీసులో క్యాషియర్ గా చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అతడికి బాగోలేదని తన స్నేహితుడితో కలిసి హాస్పిటల్ కు వెళ్లి వస్తున్నాడు.
శనివారం రాత్రి సైతం వేరే ఆసుపత్రికి వెళ్లే వచ్చారు. తన గదిలోకి వెళ్లి నిద్రపోగా సందీప్ మరో గదిలో పడుకున్నాడు. ఆదివారం ఉదయం సందీప్ పలుమార్లు డోర్ కొట్టగా పవన్ ఎంతకీ ఓపెన్ చేయలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచాడు. స్థానికుల సహాయంతో తెలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు. అతడి పెంపుడు కుక్క నోటికి రక్తం అంటుకొని ఉంది. రేపు పవన్ బర్మాంగారం నుంచి తీవ్ర రక్తస్రా వం అయినట్లు గుర్తించారు. పెంపుడు కుక్క అతడి వర్మంగాలు తినడం వల్లే పవన్ మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదీనా నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గతంలోనే పవన్ కుమార్ వివాహం చేసుకోగా.. విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు.






















