TS High Court: మరియమ్మ లాకప్ డెత్ కేసుపై హైకోర్టులో విచారణ... సీబీఐకి అప్పగింతపై తీర్పు రిజర్వ్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన మరియమ్మ లాకప్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాధితులు కోరగా... సీఐడీ విచారణ జరిపిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో దళిత మహిళ మరియమ్మ కస్టోడియల్ మృతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ ఎస్పీ కల్యాణ్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని విచారణ సమయంలో అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు చేస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు విధుల నుంచి తొలగించారని తెలిపారు. విచారణలో ఇంకా ఎవరైనా బాధ్యులని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. మరియమ్మ మృతిపై సీఐడీతో దర్యాప్తు చేయిస్తామని, సీబీఐకి అప్పగిస్తే రాష్ట్ర పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. పోలీసులపై ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. కేసును సీబీఐకి అప్పగించే అంశంపై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..
మరియమ్మ లాకప్ డెత్ సంచలనం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో దళిత మహిళ మరియమ్మ పోలీసు స్టేషన్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ కేసులో హైకోర్టు వాదనలు జరిగాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాధితులు డిమాండ్ చేసిన విషయాన్ని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. మరియమ్మ లాకప్‌డెత్ కేసులో కోర్టు ఆదేశాలపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులను తొలగించామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఈ కేసు విచారణ సవ్యంగానే సాగుతుందన్నారు. ఈ దశలో కేసును సీబీఐకి అప్పగిస్తే తెలంగాణ పోలీసులపై ప్రజలకు విశ్వాసం తగ్గుందని ఏజీ కోర్టుకు తెలిపారు. రెండు వైపులా వాదనలు విన్న కోర్టు కేసును సీబీఐకి అప్పగించే అంశంపై తీర్పు రిజర్వ్ చేసింది.
Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..
ప్రజాసంఘాలు, ప్రతిపక్షపార్టీల ఆందోళనలు
యాదాద్రి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ లో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఘటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వం బాధితురాలుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కాగా ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో ధర్మాసనం విచారం చేపట్టింది.