అన్వేషించండి

Arunachalam Crime: అరుణాచలంలో తెలుగు యాత్రికురాలిపై ఘోరం - అత్యాచారం చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు

Tamilnadu: తెలుగు భక్తులు ఎక్కువగా వెళ్తున్న అరుణాచలం పుణ్యక్షేత్రంలో భక్తులపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ మహిళా భక్తురాలిపై ఇద్దరు పోలీసులు అత్యాచారనికి పాల్పడ్డారు.

Police rape Telugu devotee in Arunachalam: అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారింది.  ఆమెపై అత్యాచారం చేసిన పోలీసులను   అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.          

ఏపీ నుంచి తురువణ్ణామలైకు ఆలయానికి వెళ్లిన  యువతి              

సోమవారం  రాత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి తిరువణ్ణామలై సమీపంలోని ఎంథాల్ బైపాస్ రోడ్డుపై ఇద్దరు మహిళలు, ముగ్గురు వ్యక్తులు, డ్రైవర్‌తో సహా  వాహనంలో వచ్చారు.  ఆ సమయంలో బైపాస్ రోడ్డుపై రాత్రి గస్తీ నిర్వహిస్తున్న తిరువణ్ణామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్‌రాజ్‌లు వాహనాన్ని అడ్డగించి వాహనంలో ఉన్న వారిని కిందకు దించారు. అందర్నీ  దింపి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ప్రశ్నించారు.              

అనుమానాస్పదం అని చెప్పి యువతిని ఆటో నుంచి దింపి తమతో తీసుకెళ్లిన పోలీసులు         

ఆ సమయంలో యువతి లక్ష్మిపై వారి కన్ను పడింది. ఆమె దగ్గర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని కొట్టి.. ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోని  పొదల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత  బైపాస్ రోడ్డు పక్కనే వదిలేసి ఇద్దరు పోలీసులు అక్కడి నుంచి పరారయ్యారు.  తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి వచ్చిన గ్రామస్థులు లక్ష్మిని రక్షించి 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.                 

అత్యాచారం చేసి రోడ్డు పక్కన పడేసి పోయిన కానిస్టేబుళ్లు - కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ         

ఈ సమాచారం తెలుసుకున్న తిరువణ్ణామలై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుధాకర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ బాధితురాలిని పరామర్శించారు. ఏం జరిగిందో స్వయంగా తెలుసుకున్నారు. ఈ విచారణలో  రాత్రి జరిగిన విషయాన్ని బాధితురాలు చెప్పింది. దీంతో  జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలిచారు. అంతేకాకుండా, తిరువణ్ణామలై మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 5 మంది పోలీసు ఇన్‌స్పెక్టర్లు సహా 10 మందికి పైగా పోలీసు అధికారులను మోహరించారు.  రేపిస్టులిద్దరూ పోలీసులే కావడంతో తిరువణ్ణామలై జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపింది. వారిద్దర్నీ అరెస్టు చేసిన పోలీసులు ..విచారణ జరుపుతున్నారు.                    

అరుణాచరంలో  తెలుగువారిపై పెరుగుతున్న దాడులు               

ఇటీవలి కాలంోల అరుణాచలంలో తెలుగు యాత్రికులపై దాడులు పెరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు అరుణాచలం వెళ్తూండటంతో తెలుగు యాత్రికులపై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇది ద్వేషంగా పెంచుకుని  దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు స్వయంగా పోలీసులే అత్యాచారనికి పాల్పడటం సంచలనంగా మారింది.           

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget