News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Women Deaths: ఖమ్మంలో ఇంటర్‌ స్టూడెంట్‌ మృతి- విశాఖలో నగ్నంగా కనిపించిన మహిళ డెడ్ బాడీ!

ఖమ్మంలో ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. కార్డియాక్‌ అరెస్ట్‌ అంటున్న డాక్టర్లు. అనుమానాలు ఉన్నాయంటున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు. కాలేజీ దగ్గర ఆందోళన.

FOLLOW US: 
Share:

ఖమ్మంలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. విద్యార్థిని మృతితో కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పాల్వంచకు చెందిన పల్లవి ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీలో ఎంపీసీ ఇంటర్‌ ఫస్టియర్‌  చదువుతోంది. ఆదివారం ఉదయం ప్రత్యేక తరగతులు ఉండటంతో...  కాలేజీకి వెళ్లింది. స్పెషల్‌ క్లాసులకు అటెండ్‌ అయ్యింది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆ తర్వాత ఏమైందో ఏమో... క్లాసులో ఉండగానే అస్వస్థతకు గురైంది పల్లవి. వెంటనే  ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. విద్యార్థిని పల్లవి మృతదేహాన్ని  ఖమ్మం ఆస్పత్రిలో ఉంచారు. పల్లవి తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు కాలేజీ నిర్వాహకులు. తమ కూతురు చనిపోయిందన్న వార్త తెలిసి  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. మరోవైపు... విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. 

పల్లవి యార్డియాక్‌ అరెస్ట్‌తోనే పల్లవి మృతిచెందిందని వైద్యులు చెప్తున్నారు. ఆమె కొన్ని ట్లాబెట్లు వేసుకుందని.. దాని వల్ల అనరోగ్యానికి గురైందని.. కార్డియాక్‌ అరెస్ట్‌  కారణంగా మృతిచెందిందని చెప్తున్నారు. అయితే... తల్లిదండ్రులు రాకముందే.. పల్లవి డెడ్‌బాడీని పోస్టుమార్టంకు తరలించడం పట్ల విద్యార్థి సంఘాల నేతలు అనుమానాలు  వ్యక్తం చేస్తున్నారు. పల్లవి మృతికి కాలేజీ యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని.... ఆందోళనకు దిగారు. కాలేజీ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు  అక్కడికి చేరుకుని విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గా మధ్య ఘర్షణ జరిగింది. ఇక, పల్లవి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఎంక్వైరీ చేస్తున్నారు.  ఆమె మృతికి గల కారణాలు ఏంటి అని ఆరా తీస్తున్నారు. పల్లవి పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చాక... అన్ని వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు.

విశాఖలో దారుణం, నగ్నంగా కనిపించిన మహిళ మృతదేహం
మరోవైపు విశాఖలో దారుణం జరిగింది. గోపాలపట్నం ఆర్టీసి డిపో ఎదురుగా ఉన్న బాలాజీ గార్డెన్స్‌లో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు ఇచ్చిన  సమాచారంతో పెందుర్తి పోలీసులు సంఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ మహిళను ఎవరో హత్య చేశారని భావిస్తున్నారు. మృతురాలి వివరాలు ఆరా తీశారు.  ఆమె పేరు రాధ గాయత్రిగా గుర్తించారు. ఆమె వయ్యస్సు 45ఏళ్లు. చనిపోయిన మహిళ ఒంటిపై దుస్తులు లేవు. దీంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరైనా  అత్యాచారం చేసి హత్య చేశారా అన్న డౌట్స్‌ కూడా వస్తున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు తరలించారు. ఎవరు హత్య చేశారు..? ఎందుకు హత్య  చేశారు..? హత్యకు గల కారణాలు ఏంటి..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కటుంబసభ్యుల వివరాలు కూడా ఆరా తీస్తున్నారు.

బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని  
చిత్తూరు జిల్లాలో ఇంటర్‌ విద్యార్థిని మృతి కలకలం రేపుతుంది.  పెనుమూరు మండలం కావూరివారిపల్లె పంచాయతీలోని వేణుగోపాలపురం గ్రామానికి చెందిన మునికృష్ణ అనే వ్యక్తి కుమార్తె 16ఏళ్ల భవ్యశ్రీ... ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈనెల 16వ తేదీన ఇంటి నుండి వెళ్లిన భవ్యశ్రీ మళ్లీ తిరిగి రాలేదు. ఎంత వెతికినా భవ్యశ్రీ ఆచూకీ దొరకలేదు. కుమార్తె కనిపించడం లేదని పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు మునికృష్ణ. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వేణుగోపాలపురంలో  గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కొందరు యువకులు.. ఊరి సమీపంలోని ఓ‌ బావి వద్దకు వెళ్లారు. ఆ బావిలో బాలిక మృతదేహం చూసి కేకలు పెట్టారు. 

Published at : 24 Sep 2023 11:43 PM (IST) Tags: Death Students Protest Inter Student Khammam

ఇవి కూడా చూడండి

Nalgonda Crime News: దేవరకొండలో లాకప్‌డెత్‌- స్థానిక ఎంపీటీసీ, ఎస్సై చుట్టూ తిరుగుతున్న వివాదం

Nalgonda Crime News: దేవరకొండలో లాకప్‌డెత్‌- స్థానిక ఎంపీటీసీ, ఎస్సై చుట్టూ తిరుగుతున్న వివాదం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్‌లోనే ఘటన

UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్‌లోనే ఘటన

Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్‌స్టర్‌లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి

Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్‌స్టర్‌లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు