Crime News: నగరంలో దారుణం - అత్తకు బలవంతంగా మద్యం తాగించి అల్లుడి లైంగిక దాడి
Hyderabad News: అత్తకు బలవంతంగా మద్యం తాగించి అల్లుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై కేసులు నమోదు చేశారు.
Son In Law Abused Aunt In Balapur: నగరంలో దారుణం జరిగింది. అత్తకు బలవంతంగా మద్యం తాగించిన అల్లుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమూద్‌నగర్ కొత్తపేట ప్రాంతానికి చెందిన షాకీర్ (34)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం షాకీర్ మామ చనిపోవడంతో అప్పటి నుంచి వాళ్ల అత్త ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నెల 4న ఉదయం షాకీర్ భార్య, అతని పిల్లలు బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో అత్త ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని చూసిన షాకీర్ ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆమెకు బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ (Balapur Police Station) పరిధిలో జరిగింది. బాధితురాలు ఈ నెల 6న బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అల్లుడు షాకీర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Food Poisoning: ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, ఆసుపత్రికి తరలించి విద్యార్థినులకు చికిత్స