By: ABP Desam | Updated at : 04 Apr 2023 03:07 PM (IST)
Edited By: jyothi
వీధికుక్కల స్వైర విహారం - ఈసారి సిద్దిపేట డిప్యూటీ కలెక్టర్ పై దాడి
Stray Dogs Attack: వీధికుక్కల స్వైర విహారం రోజురోజుకూ పెరిగిపోతోంది. హైదరాబాద్ లో ఇటీవల ఓ బాలుడిపై కుక్కలు దాడి చేయగా.. అతడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇలాంటి ఎన్నో ఘటనలు బయటకు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కొక్కరూ గయపడ్డారు. తాజాగా సిద్దిపేట జిల్లా డిప్యూటీ కలెక్టర్ పై వీధికుక్కలు దాడి చేశాయి. అయితే ఈ ఘటన ఆలస్య వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అంతా భయాందోళనకు గురవుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
సిద్దిపేట కలెక్టరేట్ క్వార్టర్స్ లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. నగర శివారులో సిద్దిపేట కలెక్టరేట్ క్వార్టర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ జిల్లా పాలనాధికారితో పాటు అధికారులు కూడా నివాసాలు ఏర్పరుచుకున్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ నివాసాల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి తన క్వార్టర్ ఆవరణలో నడుచుకుంటూ వెళ్తున్నారు. క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఎక్కడి నుంచో ఓ వీధి కుక్క వచ్చి గట్టిగా కరిచింది. శ్రీనివాస్ తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆ కుక్క వదల్లేదు. ఈ క్రమంలోనే డిప్యూటీ కలెక్టర్ రెండు కాళ్లను కొరికేసింది. దీంతో డిప్యూటీ కలెక్టర్ గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది చేరుకొని కుక్కను తరిమారు. దీంతో డిప్యూటీ కలెక్టర్ కు ఎలాంటి హానీ జరగలేదు. కానీ రెండు కాళ్లు పిక్కల మధ్య కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. విపరీతమైన రక్త స్రావం కూడా అయింది. ఈ క్రమంలోనే సిబ్బంది హుటాహుటిన డిప్యూటీ కలెక్టర్ ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స చేసిన వైద్యులు డిప్యూటీ కలెక్టర్ ను ఇంటికి పంపారు. సమీపంలో ఉన్న ఓ బాలుడిని, డిప్యూటీ కలెక్టర్ పెంపుడు కుక్కపై కూడా వీధికుక్క దాడి చేసిందట. దీంతో క్వార్టర్స్ లో ఉన్న అధికారులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత వెలుగులోకి రావడంతో అంతా షాకవుతున్నారు.
20 రోజుల క్రితం నిజామాబాద్ లో..
నిజామాబాద్ జిల్లాలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. మెండోరా మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ గంట వ్యవధిలో 12 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచాయి. ఇద్దరికి కాళ్లకు, మరో నలుగురికి చేతికి, ఇద్దరికి ఛాతీపై, మరో ఇద్దరికి ఏకంగా ముఖం పై దాడి చేసి గాయపరిచాయి. మెండోరా మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ ఉండటంతో వారిని అక్కడికి తరలించారు. డాక్టర్ కుక్కల కాటు గురైన వారిని పరిశీలించారు. 8 మందికి తీవ్రంగా గాయలయ్యాయని, మరో నలుగురికి స్వల్పంగా గాయలయ్యాని తెలిపారు. ఇద్దరికి సర్జరీ అవసరం ఉండొచ్చని డాక్టర్ తెలిపారు. మండల కేంద్రంలో కుక్కల దాడులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం
Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!
Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం
Vizianagaram Crime News : ఇలాంటి తల్లులు కూడా ఉంటారు - విజయనగరంలో ఆ పాప బయటపడింది !
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?