అన్వేషించండి

Bengaluru Siddipet Couple: భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం

Siddipet couple: బెంగళూరులో సాఫ్ట్‌వేర్ దంపతుల జీవితం విషాదాంతమైంది. . బాధితులు ఇద్దరూ తెలంగాణలోని సిద్ధిపేటకు చెందినవారు.

Couple from Siddipet commits suicide in Bengaluru:  బెంగళూరులో  సాఫ్ట్‌వేర్ దంపతుల జీవితం విషాదాంతమైంది. తన భర్త గదిలో విగతజీవిగా పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయిన భార్య, అదే అపార్ట్‌మెంట్ 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. సోమవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితులు ఇద్దరూ తెలంగాణలోని సిద్ధిపేటకు చెందినవారు. 

పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన కుంట భాను చందర్ రెడ్డి    బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య  బీబీ షాజియా సిరాజ్  ఐబీఎం   సంస్థలో టెక్కీగా పనిచేస్తున్నారు. సోమవారం భాను చందర్ తన గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన షాజియా, తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించింది.                                      

గది తలుపులు బద్దలు కొట్టి చూడగా, భాను చందర్ రెడ్డి అప్పటికే ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన షాజియా, తీవ్ర మనోవేదనకు లోనైంది. ఆ ఆవేదనలో భర్త మృతదేహాన్ని చూసిన కొద్ది నిమిషాల్లోనే ఆమె అపార్ట్‌మెంట్‌లోని 17వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.               

ఈ జంట మరణాలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అసహజ మరణాలుగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరోగ్య సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడిన ఈ యువ దంపతులు ఇలా తనువు చాలించడం వారి స్వస్థలాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 

టాప్ హెడ్ లైన్స్

Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
Tollywood Director Arrest : హీరోయిన్‌పై లైంగిక వేధింపులు? - టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్!?
హీరోయిన్‌పై లైంగిక వేధింపులు? - టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్!?
Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
Singareni Goldmine: సింగరేణి సిరి.. బంగారు గనుల తవ్వకం చేపట్టనున్న తెలంగాణ
సింగరేణి సింగారం.. మన ఇంటి బంగారం.. గోల్డ్‌ మైన్ తవ్వుతున్న తెలంగాణ
Viral News: జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Kidney Disease : కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?
కిడ్నీ వ్యాధులు పురుషుల్లో ఎక్కువా? మహిళల్లో ఎక్కువా? ఎవరికి ప్రమాదం? నెఫ్రాలజిస్ట్ ఏం చెబుతున్నారంటే?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Happy Raksha Bandhan 2026 : రాఖీ పండుగ శుభాకాంక్షలు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు పంపేందుకు బెస్ట్ రక్షాబంధన్ విషెస్ ఫోటోలతో సహా
రాఖీ పండుగ శుభాకాంక్షలు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు పంపేందుకు బెస్ట్ రక్షాబంధన్ విషెస్ ఫోటోలతో సహా
Embed widget