Kill: తల్లి, నలుగురు అక్కచెల్లెళ్లను నరికి చంపేశాడు - వాళ్ల గౌరవం కాపాడానని వీడియో రిలీజ్ చేశాడు !
Crime News: లోకంలో చాలా మంది ఉంటారు. వారి మనస్థత్వం ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఈ యూపీ వ్యక్తి తన తల్లిని, నలుగురు అక్కచెల్లెళ్లను చంపేసి వారి గౌరవాన్ని కాపాడానని చెప్పుకుంటున్నాడు.
UP Man Kills Mother 4 Sisters: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ హోటల్ గదిలో తన నలుగురు అక్క చెల్లెళ్లతో పాటు తల్లిని కూడా నరికి చంపిన ఓ యువకుడి వ్యవహారం సంచలనంగా మారింది. హత్యల తర్వాత అతను ఓ వీడియో విడుదల చేశారు. తాను వారిని చంపినా వారి గౌరవాన్ని కాపాడానని చెప్పుకొచ్చాడు. తన తల్లితో పాటు అక్కచెల్లెళ్లను అమ్మేసేందుకు కుట్ర చేశారని అంటున్నారు. అందుకే వారికి అలాంటి పరిస్థితి లేకుండా చంపేశానని చెప్పుకొచ్చాడు. తాను కూడా చచ్చిపోతానని ఆ వీడియోలో పేర్కొన్నాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులకు అక్కాచెల్లెళ్లను అమ్మాలనుకున్నారని ఆరోపించాడు.
⚠️Graphic
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 1, 2025
Heart wrenching video of a brother Arshad who k!||ed his own sisters so that they are not sold to brothels allegedly by muslim goons of his area. Wanted to convert to hinduism with family, requests @myogiadityanath to make temple at their home. pic.twitter.com/rXtn09T71G
ఈ హత్యలకు పాల్పడిన వ్యక్తిని ఆర్షద్‌గా గుర్తించారు. తల్లికి, అక్కచెల్లెళ్లకు మద్యం తాగించి, భోజనంలో మత్తు పదార్థాలు కలిపి.. మత్తులో ఉన్న సమయంలో వారిని చంపేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ముందుగా ఈ ఐదుగురి చేతి మణికట్టులను కోశాడని, ఆ తర్వాత వారు తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాని ప్రాథమిక విచారణలో తేలినట్టు అధికారులు చెబుతున్నారు.
Mohammad Arshad brutally killed his 4 sisters & mother in Lucknow & surrendered before the police.
— BALA (@erbmjha) January 1, 2025
- Arshad accuses people of his locality of attempting to sell his sisters in Hyderabad
- Muslims wanted to captured his land
- Arshad desired to convert to Hinduism but was… pic.twitter.com/hoI94hIEbR
వారు డిసెంబర్ 30న హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. హోటల్ సిబ్బంది ప్రకారం సోదరుడితో పాటు తండ్రి కూడా వారితోనే ఉండి ఉండాలి. కానీ ప్రస్తుతం అతను పరారీలో ఉండడంతో అతన్ని కూడా పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
On new year, Arshad killed his 4 sisters & mother due to family dispute in Lucknow, UP
— Frontalforce 🇮🇳 (@FrontalForce) January 1, 2025
These people are complete monsters..pic.twitter.com/6gMD8mSjWq
ఆర్థిక సమస్యలు, కుటుంబ ఆస్తుల కారణంగా అతని మానసిక స్థితి చెడిపోయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తమ ఇంటి స్థలం ఆలయం రావాలని ఆయన వీడియోలో చెప్పాడు.