Sangareddy News: టీఆర్ఎస్ పార్టీ బైక్ ర్యాలీలో అపశృతి, టపాసులు పేలి ఆటోకు నిప్పు - ఒకరికి గాయాలు
Sangareddy News: సంగారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న బైక్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. కార్యకర్తలు పేల్చిన టపాసు ఆటలో పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే ఆటోకు నిప్పంటుకుంది.
Sangareddy News: సంగారెడ్డి మెడికల్ కాళాశాల ప్రారంభోత్సవ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించింది. అయితే ఈ బైక్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు టపాసులు పేలుస్తుండగా.. పక్క నుండి వెళ్తున్న ఆటోలో టపాకాయ పేలింది. ఈ క్రమంలోనే ఆటోకు నిప్పు అంటుకుంది. అయితే ఆటోలో ఉన్న ఓ వ్యక్తికి కూడా నిప్పంటుకొని తీవ్ర కాలిన గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో వైద్య రంగంలో నూతన అధ్యాయం
— TRS Party (@trspartyonline) November 15, 2022
సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్రంలో నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పెరిగిన ప్రభుత్వ మెడికల్ సీట్లు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో నేటి నుంచి ప్రారంభం కానున్న విద్యాబోధన.#AarogyaTelangana pic.twitter.com/MN72u0esAZ
సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఈరోజు మొత్తం 8 నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో నేటి నుంచే విద్యా బోధన ప్రారంభం కానుంది.
Red-letter Day for Telangana in Medical Education & Health sector as 8 New medical colleges being launched by Hon’ble CM KCR Garu today
— KTR (@KTRTRS) November 15, 2022
3 Medical Colleges were established in 57 Years in United AP; Telangana Govt Established 12 Medical Colleges in Just 8 Years#AarogyaTelangana pic.twitter.com/qxN4iblPx2
నెల రోజుల క్రితం కేసీఆర్ పర్యటనలో కూడా అపశృతి..
తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కాన్వాయ్ జనగామ జిల్లాలో వెళ్తుండగా.. కాన్వాయ్ నుంచి ఓ మహిళా కానిస్టేబుల్ జారిపడి రోడ్డుమీద పడిపోయారు. కొంచెం దూరం వెల్లగానే అందులో ఉన్నవారు అలర్ట్ చేయడంతో వాహనం ఆగింది. తోటి పోలీసులు వచ్చి మహిళా కానిస్టేబుల్ కు సహాయం చేసే ప్రయత్నం చేయగా, మహిళా కానిస్టేబుల్ స్వయంగా లేచి వెళ్లి మళ్లీ కాన్వాయ్ ఎక్కారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ కు స్వల్పంగా గాయాలయ్యాయి.
సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం.. అంతలోనే ప్రమాదం!
ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది. అనంతరం హాస్పిటల్ ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సభలో పాల్గొంటారు. నేటి ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ జనగామ జిల్లా, పెంబర్తి కళాతోరణం చేరుకున్నారు. ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, స్థానిక నేతలు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ కాన్వాయ్ అక్కడి నుంచి కదిలింది.. అంతలోనే ఓ మహిళా కానిస్టేబుల్ సీఎం కాన్వాయ్ నుంచి జారి పడిపోయారు. స్వల్పంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.