Rwanda Man Kills: రువాండాలో దారుణ ఘటన - వేశ్యలను ఇంటికి పిలిచి చంపేశాడు, ఆపై కిచెన్ లో పాతిపెట్టాడు!
Rwanda Man Kills: రువాండాలో దారుణం వెలుగు చూసింది. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని చంపేసి కిచెన్ లో పాతిపెట్టిన ఘటన బయటకొచ్చింది.
Rwanda Man Kills: రువాండా దేశంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. రువాండా రాజధాని కిగాలీలో ఓ నరహంతకుడి దుశ్చర్యలను పోలీసులు గుర్తించారు. వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ ను కిగాలీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది. రువాండా రాజధాని కిగాలీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి 14 మంది వేశ్యలను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని చంపేసేవాడు. వారి ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుంటాడు. అనంతరం తన ఇంట్లోని కిచెన్్ లో ఓ గొయ్యి తీసి పాతి పెట్టాడు. ఇలా వరుసగా 14 మందిని చంపాడు. 34 ఏళ్లు ఈ సీరియల్ కిల్లర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. కిచెన్ లో తవ్వి ఉన్నట్లుగా కనిపించడంతో అనుమానం వచ్చి మొత్తం తవ్వారు. అలా 10 మృతదేహాల అవశేషాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే సదరు నిందితుడు హతమార్చిన వారి సంఖ్య 14 వరకు ఉండొచ్చని కిగాలీ పోలీసులు అనుమానిస్తున్నారు. 10 మృతదేహాలను పాతి పెట్టాడని, మిగతా వాటిని యాసిడ్ పోసి కరిగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితుడికి బెయిల్
అయితే 34 ఏళ్ల సదరు నిందితుడిని పోలీసులు దోపిడీ, అత్యాచారం, ఇతర నేరాల ఆరోపణలపై జులై నెలలో అరెస్టు చేశారు. అయితే కచ్చితమైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అతనికి బెయిల్ మంజూరు అయింది. అయినప్పటికీ.. అతని నేరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మంగళవారం పోలీసులు అతడిని తిరిగి అరెస్టు చేయడానికి అతను అద్దెకు ఉండే ఇంటికి వెళ్లి సోదా చేశారు. ఈ క్రమంలోనే వంటగదిలో గొయ్యి తీసిన ఆనవాళ్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సీరియల్ కిల్లర్ ఒక పథకం ప్రకారం వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. వేశ్యలైతే కుటుంబాలకు దూరంగా ఉంటారని, వారి గురించి ఆరా తీసేవారు తక్కువగా ఉంటారని, స్నేహితులూ పెద్దగా ఉండరన్న ఉద్దేశంతో వారిని ఇంటికి పిలిచి హత్య చేసేవాడని పోలీసులు భావిస్తున్నారు. హత్య చేయాలని నిర్ణయించుకునే ముందు కూడా అలాంటి వారినే ఎంపిక చేసుకునేవాడట. కొందరిని తన కిచెన్ గదిలోనే పాతిపెట్టాడని, మరికొందరిని యాసిడ్ పోసి కరిగించినట్లు పోలీసుల వద్ద నిందితుడు ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఆడవారితో పాటు పురుషులు కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్త్రీ, పురుష వేశ్యలను ఇంటికి పిలిచి వారిని ప్రలోభపెట్టేవాడని, ఆ తర్వాత వారి గొంతు కోసి చంపేసే వాడని పోలీసులు తెలిపారు.
Read Also: విజయవాడలో కుమారుడిని చంపిన తల్లి- స్నేహితుడు, కుమార్తెతో కలిసి హత్య
ఇటీవలే భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
అల్లూరు జిల్లా జీకీ వీధి మండలం సప్పర్ల గ్రామంలో కొర్ర కృష్ణారావు, గమ్మిలి ఈశ్వరమ్మ అలియాస్ వీరమ్మ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొంతకాల నుంచి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే భర్తపై అనుమానం పెంచుకున్న వీరమ్మ అతడిని ఆగస్టు 30వ తేదీ నాడు గొడ్డలితో దాడి చేసింది. అతడు తీవ్రంగా గాయపడగా.. భార్య వీరమ్మనే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ కొర్ర కృష్ణారావు ఆగస్టు 31వ తేదీ రోజు మరణించాడు. మృతుడి తల్లి సీలేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే ఎస్సై జి.రామకృష్ణ ఐసీపీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు.
అసలేం జరిగిందంటే..?
కొర్ర కృష్ణారావుకు 20 సంవత్సరాల క్రితం నాగమణి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే కొర్ర కృష్ణారావు మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అయితే అదే గ్రామంలో భర్త చనిపోయి అప్పటికే ఒంటరిగా ఉంటున్న గేమిలి ఈశ్వరమ్మ పెద్దల సమక్షంలో కృష్ణారావును రెండో వివాహం చేసుకుంది. వీరంతా సప్పర్ల గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. అయితే మొదట భార్య బిడ్డలను రెండవ భార్య సరిగ్గా చూడటం లేదని పిల్లల నానమ్మ వాళ్లను హాస్టల్ లో చేర్పించింది. అయినప్పటికీ భార్యాభర్తలు ఇద్దరూ తరచుగా గొడవలు పడుతూనే ఉన్నారు. దీంతో విసుగు చెందిన భార్య కృష్ణారావును అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఆగస్టు 30వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో భర్తను గొడ్డలితో నరికింది. తలపై మూడుసార్లు గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో వెంటనే భ్రతను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించింది భార్య వీరమ్మ. ఈక్రమంలోనే కృష్ణారావు చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రామాలు కోల్పోయాడు.
ఈ సందర్భంగా చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ.. బార్యభర్తలు ఎక్కువగా గొడవ పడొద్దని సూచించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే మహిళా పోలీసుల ద్వారా తమకు తెలియజేయాలని సూచించారు. అలా చేస్తే దంపతుల సమస్యలు పరిష్కరించి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తామన్నారు. దీని వల్ల అనేక సత్ఫలితాలు ఉంటాయని వివరించారు.