News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Car Accident: చెట్టుని ఢీకొట్టిన కారు, ఎగిసిపడిన మంటలు - కొత్త పెళ్లి జంట సజీవదహనం

Car Accident: మధ్యప్రదేశ్‌లో ఓ కారు ప్రమాదంలో కొత్త పెళ్లి జంట సజీవదహనమైంది.

FOLLOW US: 
Share:

 Car Goes Up In Flames:

మధ్యప్రదేశ్‌లో ప్రమాదం..

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కార్ వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుని ఢీకొట్టింది. ఉన్నట్టుండి అందులో నుంచి మంటలు రేగాయి. కార్‌లో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు. వీరిలో కొత్త పెళ్లి జంట కూడా ఉంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. కారు పూర్తిగా కాలి బూడిదైపోయినట్టు తెలిపారు. 

"తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కార్‌లో నలుగురున్నారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ సజీవదహనమయ్యారు. ఓ పెళ్లికి వెళ్లి వస్తున్న క్రమంలోనే ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఇటీవలే పెళ్లి చేసుకున్న ఓ జంట కూడా ఉంది. ఆర్నెల్ల క్రితమే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతోంది. "

- పోలీసులు

ఇటీవలే మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ప్రమాదమే జరిగింది. షాజాపూర్‌లో ఓ ట్రక్‌ని బస్‌ ఢీకొట్టిన ఘటనలో నలుగురు చనిపోగా..15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఇటీవల గుడ్‌గావ్‌లో ఘటన..

గుడ్‌గావ్‌లో స్పోర్ట్స్ కార్ పార్ష్ (Porsche Car Fire)కార్ బీభత్సం సృష్టించింది. మితిమీరి వేగంతో వచ్చి డివైడర్‌ని ఢీకొట్టింది. ఆ తరవాత అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. వెంటనే కార్‌లో నుంచి మంటలు చెలరేగాయి. కోట్ల రూపాయల విలువ చేసే ఈ కార్ అక్కడికక్కడే కాలి బూడిదైపోయింది. గుడ్‌గావ్‌లోని గోల్ఫ్ కోర్స్‌ రోడ్‌లో తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కార్‌లో ఇద్దరున్నారు. ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే...కార్‌లో మంటలు రాకముందే ఎలాగోలా అందులో నుంచి బయట పడి ప్రాణాలు కాపాడుకున్నారు. కాస్త ఆలస్యమైనా కార్‌తో పాటు సజీవదహనం అయ్యే వారు. చండీగఢ్‌లో రిజిస్టర్‌ అయిన ఈ కార్‌ డ్రైవర్‌ మితిమీరిన వేగంతో కార్‌ని నడిపినట్టు పోలీసులు వెల్లడించారు. కంట్రోల్ తప్పి డివైడర్‌ని ఢీకొట్టిందని చెప్పారు. ఓ డివైడర్‌ని ఢీకొట్టి పూర్తిగా పక్క రోడ్డువైపు కార్ దూసుకెళ్లింది. అక్కడే ఓ చెట్టుని ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పింది. ప్రస్తుతం ఈ కార్‌ ఓనర్ పరారీలో ఉన్నాడు. వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే..ఆ తరవాతే ఈ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసుల వద్దకు ఓ బిజినెస్‌మేన్ వచ్చాడు. ఆ కార్ తనదేనని, తన కొడుకే నడిపాడని చెప్పాడు. సడెన్‌గా కార్‌కి అడ్డంగా కుక్క వచ్చిందని, దాన్ని తప్పించబోయి డివైడర్‌ని ఢీకొట్టాడని తెలిపాడు. ప్రస్తుతానికి ఈ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

Published at : 31 May 2023 03:27 PM (IST) Tags: fire in car Car Accident Car in Flames 4 Burnt Alive Flames in Car

ఇవి కూడా చూడండి

Woman Fraud: కాబోయే భార్యే కదా అని నమ్మితే ఊహించని ట్విస్ట్! బాధితుడు లబోదిబో

Woman Fraud: కాబోయే భార్యే కదా అని నమ్మితే ఊహించని ట్విస్ట్! బాధితుడు లబోదిబో

Varalaxmi Tiffin Center Drugs Case: వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమానితో అనురాధ ప్రేమాయణం, అతడి కోసమే డ్రగ్స్ దందా

Varalaxmi Tiffin Center Drugs Case: వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమానితో అనురాధ ప్రేమాయణం, అతడి కోసమే డ్రగ్స్ దందా

Adilabad: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య, మరోఘటనలో చెంపపై కొట్టి హత్య!

Adilabad: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య, మరోఘటనలో చెంపపై కొట్టి హత్య!

Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి

Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి

Telangana: అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్ - బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు

Telangana: అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్ - బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు

టాప్ స్టోరీస్

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!