అన్వేషించండి

Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!

Rayachoti Murder Plot: మంత్రి రాంప్రసాద్ రెడ్డిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను రాయచోటి పోలీసులు భగ్నం చేశారు. స్థానికంగా ఓ హోటల్ లో అంతర్రాష్ట్ర ముఠాను, భారీగా ఆయుధాలను సీజ్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి హత్యకు కుట్ర బహిర్గతమైంది.
  • స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అంతర్రాష్ట్ర రౌడీముఠాను పట్టుకున్నారు.
  • రెండు పిస్టళ్లు, బుల్లెట్లు, గొడ్డళ్లు సహా భారీ ఆయుధాలు స్వాధీనం.
  • కిరాయి మూకలతో అలజడులకు కుట్రపై మంత్రి నిష్పక్షపాత విచారణ కోరారు.

Rayachoti Murder Plot: మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని హత్య చేసేందుకు చేసిన కుట్ర వెలుగులోకి రావడం శనివారం రాయచోటిలో తీవ్ర కలకలం సృష్టించింది. మదనపల్లె రోడ్డులోని ఓ హోటల్‌లో ఈ కుట్రను పోలీసులు ఛేదించారు. మారణాయుధాలు ఉన్న అంతర్రాష్ట్ర రౌడీముఠాను అదుపులోకి తీసుకున్నారు.

హోటల్ వద్ద ఘర్షణ – రంగంలోకి పోలీసులు

స్థానిక సంస్థల నామినేషన్ల నేపథ్యంలో వైసీపీ నాయకులతో పాటు పంజాబ్‌కు చెందిన బౌన్సర్లు, రౌడీలు హోటల్‌లో మకాం వేసి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకోగా, పరస్పర దాడుల్లో ఓ కారు ధ్వంసమైంది. పోలీసులు వెంటనే స్పందించి ఇరువర్గాలను చెదరగొట్టారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కదలికలపై గత మూడు రోజులుగా ఈ ముఠా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ రౌడీలతో పాటు కర్నూలు ప్రాంతానికి చెందిన కొందరిని రాయచోటికి తీసుకువచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

భారీగా ఆయుధాలు స్వాధీనం

రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు హోటల్‌పై దాడి చేసి  లైసెన్స్ లేని రెండు పిస్టళ్లు, 30కి పైగా బుల్లెట్లు, గొడ్డళ్లు, ఇతర మారణాయుధాలను సీజ్ చేశారు. ఈ ఘటనలో రాయచోటికి చెందిన షేక్ మహమ్మద్ షరీఫ్ జిన్నా, పంజాబ్‌కు చెందిన టార్టెమ్ సింగ్, సరబ్‌జీత్ సింగ్, ప్రభుజీత్ సింగ్, అమితాజ్, కర్నూలు జిల్లాకు చెందిన రవికుమార్ సహా మొత్తం 15 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!

కిరాయి మూకలతో అలజడులకు కుట్ర-మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

"దిల్లీ, హైదరాబాద్, పంజాబ్ ప్రాంతాల నుంచి కిరాయి మూకలను రాయచోటికి రప్పించి అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నారు. వైసీపీ అధినేత జగన్, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఈ వ్యవహారంలో ఉన్న అసలు సూత్రధారుల పాత్రపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి." - మంత్రి రాంప్రసాద్ రెడ్డి 

Also Read: ఇంజినీరింగ్ కాలేజీ దాండియాలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు

Frequently Asked Questions

రాయచోటిలో ఏ కలకలం రేపింది?

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని హత్య చేసేందుకు జరిగిన కుట్ర శనివారం రాయచోటిలో తీవ్ర కలకలం సృష్టించింది. మదనపల్లె రోడ్డులోని ఓ హోటల్‌లో ఈ కుట్రను పోలీసులు ఛేదించారు.

ఈ కుట్రలో ఎవరు పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు?

ఈ కుట్రలో అంతర్రాష్ట్ర రౌడీముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్ పంజాబ్, కర్నూలు ప్రాంతాల నుండి రౌడీలను తీసుకువచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

పోలీసులు హోటల్‌లో ఏమి స్వాధీనం చేసుకున్నారు?

పోలీసులు దాడి చేసి లైసెన్స్ లేని రెండు పిస్టళ్లు, 30కి పైగా బుల్లెట్లు, గొడ్డళ్లు, ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరుగుతోంది.

ఈ హత్యకుట్ర వెనుక ఉద్దేశ్యం ఏమిటి?

స్థానిక ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కదలికలపై ఈ ముఠా నిఘా ఉంచింది. కిరాయి మూకలతో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నారని మంత్రి ఆరోపించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Webland Records Tampering: వెబ్‌ల్యాండ్‌ రికార్డుల తారుమారు.. ఎన్‌ఐసీ లాగిన్ కొట్టేసి రూ.కోట్ల భూముల అక్రమార్జన.. నలుగురి అరెస్ట్!
వెబ్‌ల్యాండ్‌ రికార్డుల తారుమారు.. ఎన్‌ఐసీ లాగిన్ కొట్టేసి రూ.కోట్ల భూముల అక్రమార్జన.. నలుగురి అరెస్ట్!
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
Hyderabad Crime: వనస్థలిపురంలో విషాదం.. ప్రేమ నిరాకరించిందని, యువతి ఇంట్లోనే బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య!
వనస్థలిపురంలో విషాదం.. ప్రేమ నిరాకరించిందని, యువతి ఇంట్లోనే బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య!
ACB Raids: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Kulgam Terrorist Attack: కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Embed widget