అన్వేషించండి

Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!

Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి కొప్పుల రవిని పోలీసులు అరెస్టు చేశారు. నామినేషన్ కోసం భారీగా తెలంగాణ మద్యం తరలించారని గుర్తించిన పోలీసులు మద్యం సీజ్ చేసి, రవిని అరెస్టు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దాచేపల్లి స్థానిక ఎన్నికల మద్యం సీజ్; వైసీపీ అభ్యర్థి అరెస్ట్.
  • రవి ఇంట్లో 429 మద్యం స్వాధీనం; అనుచరుడితో అరెస్ట్.
  • వైసీపీ నేతల ఆందోళన; కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది.

Dachepalli YCP Candidate Arrest: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది.  ఓటర్లను ఆకర్షించేందుకు, నామినేషన్ రోజు పంచేందుకు భారీగా సిద్ధం చేసిన తెలంగాణ మద్యాన్ని స్థానిక పోలీసులు సీజ్ చేసుకున్నారు. ఈ కేసులో వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవిని, ఆయన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇంట్లో తనిఖీలు.. 429 సీసాల సీజ్ 

ఛైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేసే రోజు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేయడానికి రవి అనుచరుడు బుర్రి అనిల్‌తో పాటు మరికొందరు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలించినట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. దీంతో  దాచేపల్లి ఎస్సై ఖాసింవలి శుక్రవారం తెల్లవారుజామున రవి నివాసంలో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.64,640 విలువైన 429 తెలంగాణ మద్యం సీసాలను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు కొప్పుల రవి, బుర్రి అనిల్‌లను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన సమయంలో నిందితుల ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. "నామినేషన్‌ సందర్భంగా అందరూ మద్యం పంపిణీ చేస్తారు కదా, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే.. కేసు నమోదు చేయకుండా వదిలేయండి" అని కొప్పుల రవి సీఐ ఖాజావలితో వాదనకు దిగడం గమనార్హం. మరోవైపు, ఈ వ్యవహారంతో రవికి ఎలాంటి సంబంధం లేదని, మద్యం తీసుకొచ్చి దాచింది తానేనంటూ ఆయన అనుచరుడు బుర్రి అనిల్ సీఐకి చెప్పి, రవిని వదిలేసి తనను మాత్రమే అరెస్టు చేయాలని కోరాడు.

Also Read: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట

పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ ఆందోళన  

కొప్పుల రవి అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాచేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, వైసీపీ నాయకుడు మురళీధర్‌రెడ్డి పీఎస్ కు చేరుకొని సీఐ ఖాజావలితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆరోపించారు. అయితే చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసిన పోలీసులు, నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఈ నెల 30 వరకు రిమాండ్ విధించింది. 

Also Read: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!

Frequently Asked Questions

దాచేపల్లి వైసీపీ అభ్యర్థిని ఎందుకు అరెస్టు చేశారు?

దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి కొప్పుల రవిని తెలంగాణ మద్యం సీసాలను అక్రమంగా తరలించి నిల్వ చేసినందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసిన 429 సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు తనిఖీల్లో ఏమేమి లభించాయి?

దాచేపల్లి ఎస్సై ఖాసింవలి కొప్పుల రవి నివాసంలో జరిపిన తనిఖీల్లో రూ.64,640 విలువైన 429 తెలంగాణ మద్యం సీసాలను గుర్తించి సీజ్ చేశారు. వీటిని నామినేషన్ రోజు పంచేందుకు సిద్ధం చేశారు.

అరెస్టు సమయంలో నిందితుల ప్రవర్తన ఎలా ఉంది?

కొప్పుల రవి మద్యం పంపిణీ సాధారణమేనని వాదించగా, ఆయన అనుచరుడు బుర్రి అనిల్ మద్యాన్ని తానే తెచ్చానని చెప్పి రవిని వదిలేయమని కోరాడు.

కొప్పుల రవి అరెస్టుపై వైసీపీ నాయకులు ఎలా స్పందించారు?

కొప్పుల రవి అరెస్టు వార్త తెలియగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాచేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి సహా ఇతర నాయకులు దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Alluri Blasting News: అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
Hyderabad Crime News: మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Embed widget