CI Dismiss : మాజీ సీఐ నాగేశ్వరరావు డిస్మిస్ - కీలక నిర్ణయం తీసుకున్న సీవీ ఆనంద్ !
పోలీసు శాఖ ఇచ్చిన గన్ గురి పెట్టి మరీ మహిళపై అత్యాచారం చేసినట్లుగా కేసులు ఎదుర్కొంటున్న సీఐ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు.
CI Dismiss : మాజీ సీఐ నాగేశ్వరరావును డిస్మిస్ చేశారు. నాగేశ్వరరావుపై వనస్థలిపురం పీఎస్ లో అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. పోలీస్ సర్వీస్ నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావును తొలగించారు. గన్ తో బెదిరించి వివాహితపై అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగేశ్వరరావు వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆయనను సర్వీస్ నుంచి తొలగిస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి పీఎస్‌లో గతంలో SHO గా పనిచేస్తున్న సమయంలో అత్యాచారం కేసులో అరెస్టయ్యారు. ఆయనపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో 875/2022 U/s 452, 376 (2), 307, 448, 365 IPC sec C of Arms act 1959 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసు డిపార్ట్‌మెంట్ అతనికి ఇచ్చిన అధికారాన్ని హద్దులేని దుర్వినియోగం చేసినట్టు నిర్దారించి సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జైలులో ఉన్న నాగేశ్వరరావు ఇటీవలే షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చారు. వివాదాస్పద చరిత్ర ఉన్న నాగేశ్వరరావు జూలై 7వ తేదీన హైద్రాబాద్ నగరంలోని హస్తినాపురంలోని వివాహిత ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు నమోదయింది. రివాల్వర్ కణతకు పెట్టి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తపై కూడా ఆయన దాడికి దిగాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపిన పోలీసులు నిజమేనని తేలడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనపై పెన్షన్ ను వేటు వేస్తూ హైద్రాబాద్ సీపీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. అప్పట్నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా డిస్మిస్ అయ్యాు.
నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో కూడా కీలక విషయాలను పోలీసులు ప్రకరటించారు. బాధితురాలి భర్త ఇంట్లో ఉన్నాడా అనే విషయాన్ని తెలుసుకొనేందుకు మొబైల్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి భర్త ఇంట్లో లేని విషయాన్ని గుర్తించి ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందు కోసం పోలీసు వ్యవస్థ ఇచ్చిన అధికారాల్ని దుర్వినియోగం చేశాడు. కేసు నమోదైన తర్వాత పరారీలో ఉన్న నాగేశ్వరరావు.. బాధిత దంపతులతో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నాగేశ్వరరావు తన నేరాన్ని అంగీకరించారు.
నాగేశ్వరరావు గత 8ఏళ్లుగా టాస్క్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. కొంత మంది రాజకీయ నేతల అండదండలు ఉండటంతో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫామ్ హౌసులు.. పెద్ద పెద్ద ఇళ్లు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగేశ్వరరావుకు సుమారు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 200కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. రేప్ కేసుతో పాటు నాగేశ్వరరావు అక్రమ ఆస్తులపైనా పోలీసులు విచారణ కొనసాగనుంది.