Hyderabad Road Accident: రామాంతపూర్‌లో రోడ్డు ప్రమాదం - భర్త కళ్లెదుటే మహిళపై నుంచి వెళ్లిన లారీ
Woman Dies In Road Accident: భర్త కళ్లెదుటే భార్య మీద నుంచి లారీ దూసుకెళ్లింది. భార్య మరణించగా, భర్తకు స్వల్ప గాయాలయ్యాయి.
Hyderabad Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భర్త కళ్లెదుటే భార్య మీద నుంచి లారీ దూసుకెళ్లింది. బైకుపై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుంచి వచ్చిన లారీ ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. కింద పడిన వెంటనే భార్య తలపై నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. రామాంతపూర్‌లో శుక్రవారం ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
అనుకోని ప్రమాదం.. అంతులేని విషాదం..
పోలీసుల కథనం ప్రకారం.. దంపతులు యాక్టివా నంబర్ – TS 08 HH 0380 వాహనంపై ప్రయాణిస్తున్నారు. శుక్రవారం ఉదయం రామాంతపూర్ రోడ్డుపై వెళ్తుండగా వాహనాల రద్దీ అప్పుడే మొతలైంది. వీరు ముందు ఓ ఆర్టీసీ బస్సు వెళ్తుండగా.. యాక్టివాను రోడ్డుకు ఓ పక్కగా నడిపే ప్రయత్నం చేస్తుండగానే బస్సును ఓవర్ టెక్ చేద్దామని ప్రయత్నించిన లారీ, ఢీకొట్టింది. దంపతులు వాహనం పైనుంచి కింద పడగానే భార్య మీద నుంచి లారీ వెనుక చక్రాలు వెళ్లాయి. దీంతో మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, హెల్మెట్ ధరించిన భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.